తిర్మలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు 2026 – ధ్వజారోహణం, వాహన సేవలు, కల్యాణం, రథోత్సవం

 దేవునితిర్మలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

తీరితే తిరుపతి.. లేకుంటే తిరుమలాపురం వెళ్లాలి” అనే నానుడి పూర్వకాలం నుంచే ప్రసిద్ధిగా వినిపిస్తుంది. ఆ నానుడికి నిదర్శనంగా నిలిచిన క్షేత్రమే దేవునితిర్మలాపురం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తుల అపార విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది.

ఈ పవిత్ర ఆలయంలో బుధవారం నుంచి తొమ్మిది రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సంప్రదాయ పూజావిధానాలు, విశేష వాహన సేవలు, కల్యాణోత్సవాలతో ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించనున్నాయి.

2026 బ్రహ్మోత్సవాల కార్యక్రమాల వివరాలు

  • ఈ నెల 28 (బుధవారం): ధ్వజారోహణం, పల్లకీ సేవ, గజ వాహనం
  • 29వ తేదీ: పల్లకీ సేవ, శేష వాహన సేవ
  • 30వ తేదీ: హనుమత్ వాహన సేవ
  • 31వ తేదీ: గరుడ వాహన సేవ
  • ఫిబ్రవరి 1: శ్రీ స్వామివారి కల్యాణోత్సవం
  • ఫిబ్రవరి 2: రాత్రి రథోత్సవం
  • ఫిబ్రవరి 3: చక్రస్నానం
  • ఫిబ్రవరి 4: తీర్థావళి, మంగళహారతితో బ్రహ్మోత్సవాల ముగింపు

No comments