నెల్లూరు నవాబుపేట శ్రీ ఆదికేశవ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు 2026 – వాహన సేవలు, కల్యాణం, అవబృద స్నానం

నెల్లూరు నగరంలోని నవాబుపేట ఉడయవర్లు దేవస్థానంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఆదికేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభం అయ్యాయి.

ఈ బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధమైన పూజావిధానాలు, విశేష వాహన సేవలు, ఉత్సవ అలంకారాలతో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్నాయి.

2026 బ్రహ్మోత్సవాల కార్యక్రమాల వివరాలు

గురువారం:
సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది.

శుక్రవారం:
ఉదయం ధ్వజారోహణం, రాత్రి శేష వాహన అలంకారం నిర్వహించనున్నారు.

31వ తేదీ:
ఉదయం సూర్యప్రభ వాహన సేవ, రాత్రి హనుమంత వాహన సేవ జరుగుతాయి.

ఫిబ్రవరి 1:
ఉదయం మోహినీ అవతార అలంకారం, రాత్రి గరుడ సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 2:
ఉదయం కల్యాణోత్సవం, నగరోత్సవం జరుగుతాయి. సాయంత్రం అశ్వ వాహన సేవ ఉంటుంది.

ఫిబ్రవరి 3:
ఉదయం ముసుగుల సేవ, మధ్యాహ్నం అవభృథ స్నానం, రాత్రి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

No comments