Tirupati Kodandarama Temple: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఫిబ్రవరి 2026 ఉత్సవాల షెడ్యూల్

 

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

• ఫిబ్రవరి 2 – మాఘ పౌర్ణమి సందర్భంగా
  కూపు చంద్రపేట ఉత్సవం

• ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీలలో (శనివారం)
  ఉదయం 6:00 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవిరాట్టులకు అభిషేకం
  సాయంత్రం 5:00 గంటలకు ఊంజల్ సేవ
  సాయంత్రం 5:30 గంటలకు తిరుచ్చి ఉత్సవం

• ఫిబ్రవరి 17 – అమావాస్య సందర్భంగా
  ఉదయం 8:30 గంటలకు సహస్ర కలశాభిషేకం
  రాత్రి 7:00 గంటలకు హనుమంత వాహన సేవ

• ఫిబ్రవరి 28 – పునర్వసు నక్షత్రం సందర్భంగా
  ఉదయం 11:00 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం
  సాయంత్రం 5:30 గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా
    శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపు
  సాయంత్రం 6:30 గంటలకు ఊంజల్ సేవ

No comments