Annavaram Temple: అన్నవరం దేవస్థానం ధనుర్మాసోత్సవాలు 2025 – మెట్లోత్సవం, ముక్కోటి ఏకాదశి, భోగి, కనుమ
అన్నవరం దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 16 నుంచి జనవరి 16 వరకు ధను ర్మాసం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
| తేదీ | రోజు | సమయం | నిర్వహించే కార్యక్రమం | విశేషం |
|---|---|---|---|---|
| డిసెంబర్ 15, 2025 | సోమవారం | ఉదయం 7:00 గంటలకు | స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం | ఉత్సవ మూర్తులను పల్లకీలో ఉంచి గ్రామ సేవ నిర్వహిస్తారు. |
| డిసెంబర్ 15, 2025 | సోమవారం | ఉదయం 9:00 గంటకి | మెట్లోత్సవం ప్రారంభం | కొండ దిగువన తొలి పావంచాల నుంచి మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ రాసి హారతి వెలిగిస్తూ భక్తులు పూజ చేస్తూ కొండపైకి చేరుకుంటారు. |
| డిసెంబర్ 16, 2025 | మంగళవారం | - | ధనుర్మాస ఉత్సవ ఆరంభం | ధనుర్మాస ఉత్సవాల ప్రారంభం. |
| డిసెంబర్ 30, 2025 | మంగళవారం | తెల్లవారుజామున 5:00 గంటలకు | ముక్కోటి ఏకాదశి దర్శనం | ఉత్తర ద్వారం ద్వారా సత్యదేవుని దర్శించుకోవచ్చు. |
| డిసెంబర్ 30, 2025 | మంగళవారం | ఉదయం 11:00 గంటలకు | వెండి రథంపై ప్రాకారసేవ | ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు. |
| డిసెంబర్ 30, 2025 | మంగళవారం | రాత్రి | గరుడ వాహన సేవ, గ్రామోత్సవం | కొండ దిగువన గరుడ వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. |
| జనవరి 14, 2026 | బుధవారం | - | భోగి పండుగ | ఆలయ ప్రాంగణంలో భోగి ఘనంగా నిర్వహిస్తారు. |
| జనవరి 16, 2026 | శుక్రవారం | - | కనుమ పండుగ సందర్భంగా ప్రభోత్సవం | రథోత్సవం నిర్వహిస్తారు. |

Comments
Post a Comment