Buchireddypalem Kodandarama Swamy Brahmotsavam: బుచ్చిరెడ్డిపాలెం శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు 2026 – వాహనసేవలు, ఉత్సవాలు

బుచ్చిరెడ్డిపాలెం శ్రీ కోదండరామస్వామి ఆలయం  రాష్ట్రంలోని అత్యంత ప్రాచీన మరియు పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్ర స్వామివారికి ప్రతిష్టించబడిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. 2026 సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు మార్చి 26న ప్రారంభమై ఏప్రిల్ 5న ముగుస్తాయి. ఈ సందర్భంగా అనేక వైభవమైన వాహనసేవలు, ఉత్సవాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి.

2026 బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు 

మార్చి 26

సాయంత్రం 7:00 – 9:00 : అంకురార్పణ

మార్చి 27 – శ్రీరామనవమి

ఉదయం 9:20 – 10:20 : ధ్వజారోహణం
రాత్రి 11:00 : శేష వాహన సేవ

మార్చి 28

ఉదయం 9:00 : సూర్యప్రభ వాహన సేవ
రాత్రి 10:30 : హంస వాహన సేవ

మార్చి 29

ఉదయం 8:45 : తిరుచ్చి ఉత్సవం
రాత్రి 10:30 : యాళి వాహన సేవ

మార్చి 30

ఉదయం 9:00 : తిరుచ్చి ఉత్సవం
రాత్రి 11:30 : హనుమంత వాహన సేవ

మార్చి 31

ఉదయం 9:30 : మోహినీ అవతారం
అర్ధరాత్రి 12:00 : గరుడ సేవ

ఏప్రిల్ 01

సాయంత్రం 7:00 : కల్యాణోత్సవం
ఉదయం 3:00 : గజ వాహన సేవ

ఏప్రిల్ 02

ఉదయం 10:30 : రథోత్సవం
రాత్రి 8:00 : తెప్పోత్సవం
రాత్రి 11:00 : పొన్న వాహన సేవ

ఏప్రిల్ 03

ఉదయం 9:00 : తిరుచ్చి ఉత్సవం
రాత్రి 10:00 : అశ్వ వాహన సేవ

ఏప్రిల్ 04

ఉదయం 9:00 : అలకటోపు ఉత్సవం
ఉదయం 11:00 : చక్రస్నానం
రాత్రి 8:00 : ధ్వజావరోహణం

ఏప్రిల్ 05

సాయంత్రం 7:00 : ఏకాంత సేవ

No comments