Kanuma Festival: తెలుగువారి కనుమ పండుగ 2026 – ఆచారాలు, విశేషాలు, ముక్కనుమ వ్రతాలు
కనుమ పండుగ – తెలుగు సంప్రదాయాల మహోత్సవం
తెలుగువారి సంక్రాంతి మూడు రోజుల పండుగ.
మొదటి రోజు భోగి,
రెండవ రోజు మకర సంక్రాంతి,
మూడవ రోజు కనుమ పండుగ.
కనుమ పండుగ ప్రత్యేకత
కనుమ పండుగను “కనుమూపులు పండుగ” అని కూడా అంటారు.
కనుము అంటే పశువు అని అర్థం.పులు అనే తెలుగు పదానికి అల్పమైనది, మాలిన్యం, కసువు అనే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ కసువు అంటే గడ్డి అని భావం.
కనుమ పండుగ నాడు పశువులకు కనీసం గడ్డిని వేసి తినిపించడం రైతుల కర్తవ్యంగా భావిస్తారు. అందుకే ఈ పండుగకు కనుమూపులు అనే పేరు వచ్చింది.
పశువుల పూజ – అలంకరణ
కనుమ రోజు పూజా కార్యక్రమాలు పూర్తిచేసిన తరువాత పశువుల అలంకరణకు సిద్ధమవుతారు.
పశువులను శుభ్రంగా కడిగి, పసుపు పూసి బొట్లు పెట్టి, పూల దండలతో అలంకరిస్తారు.
మెడలో గంటలు కట్టి ఆనందోత్సాహాలతో పూజిస్తారు.
ఇళ్లలో పొంగలి వండి, దేవునికి నైవేద్యం సమర్పించిన తరువాత, ఆ పొంగలిని పశువులకు తినిపిస్తారు.
పక్షుల పూజ
కనుమ రోజు పశువులతో పాటు పక్షులను కూడా పూజించే సంప్రదాయం ఉంది.
ఇళ్లలో, దేవాలయాలలో వరికంకులను కుచ్చులుగా కట్టి పక్షులు తినేందుకు ఉంచుతారు.
బహిరంగ ప్రదేశాలలో పక్షులు గుమ్ముగూడే చోట గింజలు చల్లి ఆహారం అందిస్తారు.
పౌరాణిక ప్రాముఖ్యత
అల నాడు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో పైకి ఎత్తి శ్రీకృష్ణ పరమాత్మ నందగోకులాన్ని రక్షించిన రోజు కూడా కనుమ పండుగ రోజే అని పురాణాలు చెబుతున్నాయి.
ముక్కనుమ – పండుగ ముగింపు
కనుమ తరువాత రోజు ముక్కనుమ.
ఈ రోజున రథం ముగ్గుతో సంక్రాంతి పండుగకు ముగింపు పలుకుతారు.
కొన్ని ప్రాంతాలలో కనుమ రోజునే రథం ముగ్గులు వేయడం ఆనవాయితీ.
ముక్కనుమ రోజు ఆడపిల్లలు బొమ్మల నోము పడతారు.
కొత్తగా పెళ్లైన మహిళలు సావిత్రి గౌరీ వ్రతం ఆచరిస్తారు.
కనుమ పండుగ – 2026
2026 సంవత్సరం కనుమ పండుగ తేదీ: జనవరి 16

Comments
Post a Comment