Ishta Kameswari Temple: శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం - శ్రీశైలం
దట్టమైన నల్లమల అడవుల నడుమ దాగి ఉన్న ఒక మహిమాన్విత శక్తి క్షేత్రం ఇష్ట కామేశ్వరి దేవి ఆలయం.
ఈ ఆలయం గురించి అతి కొద్దిమందికే తెలుసు.
శ్రీశైల క్షేత్రంలో తప్ప దేశంలో మరెక్కడా ఇష్ట కామేశ్వరి దేవి పేరుతో ఆలయం కనిపించదు అనడం ఈ క్షేత్ర ప్రత్యేకత.
దర్శనం – అదృష్టానికి ప్రతీక
అమ్మవారి అనుగ్రహ విధానం
అమ్మవారిని దర్శించిన తరువాత మన మనసులోని కోరికను ఆమెకు చెప్పిఅమ్మవారి నుదుటన మన చేతితో బొట్టు పెట్టాలి.
ఆ క్షణంలో అమ్మవారి నుదురు నిజమైన మనిషి నుదురులాగా మెత్తగా తగలడం, అనిర్వచనీయమైన అనుభూతితో ఒళ్ళంతా జలదరించడం అనేది అనేక భక్తుల అనుభవం.
గుహలో వెలసిన తపోమూర్తి
-
రెండు చేతుల్లో తామర మొగ్గలు,
-
మరో రెండు చేతుల్లో శివలింగం, రుద్రాక్ష మాల ధరించి
-
తపస్సు చేస్తున్నట్లుగా దర్శనమిస్తారు.
ఒక గుహలో వెలసిన ఈ ఆలయంలో, దీపపు వెలుగు మధ్య అమ్మవారిని దర్శించుకోవాలి. ఆ ప్రశాంత వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది.
ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేస్తే మనసుకు అపూర్వమైన ప్రశాంతత లభిస్తుంది.
చెంచుల నిత్య పూజలు
ఈ నల్లమల అడవుల్లో నివసించే చెంచు గిరిజనులు, ఇష్ట కామేశ్వరి అమ్మవారికి నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. వారి భక్తి, సరళత ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను చేకూరుస్తుంది.
ప్రయాణం – ఒక సాహసం
ఒకప్పుడు ఈ ఆలయానికి చేరుకోవడానికి సరైన దారి కూడా లేకపోయేది. కొండల మీద జీపు ప్రయాణం అత్యంత ప్రమాదకరమైన సాహసంగా ఉండేది. అందుకే అప్పట్లో అడవుల్లోని సిద్ధులచే మాత్రమే అమ్మవారు పూజలందుకునేది.
ఆలయ స్థానం
ఇక్కడికి
-
కార్లు వెళ్లలేవు,
-
శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో జీపులు మాత్రమే నడుస్తాయి.

Comments
Post a Comment