కర్నూలు మామిదాలపాడు గోదా గోకులం క్షేత్రంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు 2025 – జనవరి 25 వరకు వైభవం

 

కర్నూలు: గోదా గోకులం క్షేత్రం - ధనుర్మాస వ్రత మహోత్సవం (2025-26)

  • పర్యవేక్షణ: ఈ వ్రత మహోత్సవాలు త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో కొనసాగుతాయి.

  • కాలం: డిసెంబర్ 16, 2025 (మంగళవారం) నుంచి జనవరి 25, 2026 వరకు.

నిత్య ఉదయం కార్యక్రమాలు (ధనుర్మాస పూజ)

సమయంకార్యక్రమంవివరాలు
ఉదయం 4:30 గంటలకునిత్య ఆరాధనశ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామి భోగమూర్తులు, గోదాకృష్ణులు, సాలగ్రామాలకు అభిషేకం.
4:30 తర్వాతపారాయణాలువిష్ణు సహస్రనామ పారాయణ, గోవింద నామాలు పఠనం.
ఉదయం 5:00 గంటలకుఅలంకరణఅలంకరణ మరియు తోమాల సేవ.
ఉదయం 5:20 గంటలకువేంచేపుగోదా అమ్మవారిని ముఖ మండపంలో వేంచేపు చేయడం, అష్టోత్తర శతనామార్చన.
ఉదాయం 5:40 గంటలకుసేవా కాళంతిరుప్పావై గానం (గోదాదేవి పాశుర పఠనం).
ఉదయం 6:50 గంటలకుముగింపుపాశుర విన్నపం, మాల మార్పిడి, తీర్థప్రసాదాల వితరణ.

నిత్య సాయంత్రం కార్యక్రమాలు

సమయంకార్యక్రమంవివరాలు
సాయంత్రం 5:00 గంటలకునిత్య ఆరాధన & నివేదన-
సాయంత్రంసాంస్కృతిక కార్యక్రమాలుభజనలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు.
రాత్రి 8:00 గంటలకునిత్య పల్లకీ సేవ-
విశేష రోజుల్లోప్రత్యేక సేవలుప్రత్యేక వాహన సేవలు ఏర్పాటు.

Comments

Popular Posts