Margashira Masam 2025 Festivals: మార్గశిర మాసం 2025 – పర్వదినాలు, పుణ్య తిథులు
మార్గాలు అన్నింటికీ శీర్షం (తలకు) వంటిది కాబట్టి 'మార్గశీర్షం' అని పిలవబడే ఈ మాసం అనేక పండుగలకు, వ్రతాలకు నిలయం.
మార్గశిర మాసం ప్రాధాన్యత
పవిత్రత: తెలుగు పంచాంగం ప్రకారం ఇది తొమ్మిదవ మాసం.
ప్రీతిపాత్రం: లక్ష్మీ నారాయణులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాసాలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
ధనుర్మాసం: ఈ మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుంది. అందుకే ఆధ్యాత్మికంగా ఈ మాసం చాలా పవిత్రమైనది.
ఆధ్యాత్మిక మరియు చారిత్రక అంశాలు
ఉత్తమ సమయం: మార్గశిర మాసం దైవారాధనకు, ఆధ్యాత్మిక సాధనకు అనువైనదని పురాణాలు చెబుతున్నాయి.
ద్వాపర యుగంలో: ద్వాపర యుగంలో ఈ మాసం నుంచే కొత్త సంవత్సరం మొదలయ్యేది మహాభారతం ద్వారా తెలుస్తోంది.
తిథుల విశిష్టత: మార్గశిరం తొలిరోజు నుంచి ప్రతిరోజూ పండుగే! ప్రతి తిథి పవిత్రమైనదే!
నామం: తెలుగు పంచాంగంలోని 12 నెలలకు శీర్షం వంటిది. ఈ మాసాన్ని మార్గశీర్షం అని కూడా అంటారు.
| తేదీ | రోజు | తిథి | పండుగ / విశేషం |
|---|---|---|---|
| నవంబర్ 21 | శుక్రవారం | మార్గశిర శుద్ధ పాడ్యమి | మార్గశిర మాసం ప్రారంభం, పోలి పాడ్యమి, నదీస్నానం |
| నవంబర్ 22 | శనివారం | మార్గశిర శుద్ధ విదియ | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి గరుడోత్సవం |
| నవంబర్ 23 | ఆదివారం | మార్గశిర శుద్ధ తదియ | |
| నవంబర్ 24 | సోమవారం | మార్గశిర శుద్ధ చవితి | వరద చతుర్థి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం |
| నవంబర్ 25 | మంగళవారం | మార్గశిర శుద్ధ పంచమి | నాగ పంచమి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి చక్రస్నానం, పంచమి తీర్థం |
| నవంబర్ 26 | బుధవారం | మార్గశిర శుద్ధ షష్టి | సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్టి, శుక్ర మూఢమి ప్రారంభం, తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో స్కంద షష్ట్యుత్సవం |
| నవంబర్ 27 | గురువారం | మార్గశిర శుద్ధ సప్తమి | మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆరంభం, మిత్ర సప్తమి |
| నవంబర్ 28 | శుక్రవారం | మార్గశిర శుద్ధ అష్టమి | కాలభైరవాష్టమి |
| నవంబర్ 29 | శనివారం | మార్గశిర శుద్ధ నవమి | నందిని నవమి |
| తేదీ | రోజు | తిథి | పండుగ / విశేషం |
|---|---|---|---|
| డిసెంబర్ 1 | సోమవారం | మార్గశిర శుద్ధ ఏకాదశి | గీతా జయంతి, ఉత్తమ ఏకాదశి (మోక్షద ఏకాదశి) |
| డిసెంబర్ 2 | మంగళవారం | మార్గశిర శుద్ధ ద్వాదశి/త్రయోదశి | మత్స్య ద్వాదశి, వాసుదేవ ద్వాదశి, చక్ర తీర్థ ముక్కోటి, పక్ష ప్రదోషం |
| డిసెంబర్ 3 | బుధవారం | మార్గశిర శుద్ధ త్రయోదశి/చతుర్దశి | హనుమద్ వ్రతం, తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిన కృత్తికా దీపోత్సవం |
| డిసెంబర్ 4 | గురువారం | మార్గశిర శుద్ధ చతుర్దశి/పౌర్ణమి | దత్త జయంతి, కపిల తీర్థ ముక్కోటి, అన్నపూర్ణ జయంతి |
| డిసెంబర్ 5 | శుక్రవారం | మార్గశిర శుద్ధ పౌర్ణమి/పాడ్యమి | కోరల పౌర్ణమి (మార్గశిర పౌర్ణమి) |
| డిసెంబర్ 6 | శనివారం | మార్గశిర బహుళ విదియ | |
| డిసెంబర్ 7 | ఆదివారం | మార్గశిర బహుళ తదియ | తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిన లక్ష బిల్వార్చన |
| డిసెంబర్ 12 | శుక్రవారం | మార్గశిర బహుళ అష్టమి | అనఘాష్టమి |
| తేదీ | రోజు | తిథి | పండుగ / విశేషం |
|---|---|---|---|
| డిసెంబర్ 15 | సోమవారం | మార్గశిర బహుళ ఏకాదశి | సర్వ ఏకాదశి, శ్రీ పొట్టి శ్రీరాముల వర్ధంతి, కుసుమ కుమారి జయంతి |
| డిసెంబర్ 16 | మంగళవారం | మార్గశిర బహుళ ద్వాదశి | ధను సంక్రమణం, ధనుర్మాసారంభం |
| డిసెంబర్ 17 | బుధవారం | మార్గశిర బహుళ త్రయోదశి | తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావై ప్రారంభం, శ్రీ వైష్ణవ తిరుప్పావై |
| డిసెంబర్ 18 | గురువారం | మార్గశిర బహుళ చతుర్దశి | మాసశివరాత్రి |
| డిసెంబర్ 20 | శనివారం | మార్గశిర బహుళ అమావాస్య | గౌరీ తపో వ్రతం, మార్గశిర మాసం పూర్తవుతుంది. మరుసటి రోజు నుంచి పుష్య మాసం ప్రారంభం అవుతుంది. |











Comments
Post a Comment