Thondamanadu Venkateswara Swamy Temple: తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2026 పూర్తి షెడ్యూల్ & యాత్రా గైడ్

తిరుపతి సమీపంలోని పవిత్ర క్షేత్రం తొండమాన్‌పురం లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి వైభవాలతో నిర్వహించబడనున్నాయి. ఈ మహోత్సవాలు ఫిబ్రవరి 16 నుండి 24వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి.

అంకురార్పణ

బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజు అయిన ఫిబ్రవరి 15న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ధ్వజారోహణం – బ్రహ్మోత్సవాల ఆరంభం

ఫిబ్రవరి 16న ఉదయం 9.15 నుండి 9.45 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. అదే రోజు రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ నిర్వహించబడుతుంది.

2026 రోజువారీ వాహన సేవలు

ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వివిధ వాహన సేవలు భక్తులకు దర్శనమివ్వనున్నాయి.

  • ఫిబ్రవరి 17 – హంస వాహనం
  • ఫిబ్రవరి 18 – సింహ వాహనం
  • ఫిబ్రవరి 19 – హనుమంత వాహనం

గరుడ సేవ & కల్యాణోత్సవం

ఫిబ్రవరి 20న

  • సాయంత్రం 5 గంటలకు కల్యాణోత్సవం
  • రాత్రి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది.

తదుపరి ఉత్సవాలు

  • ఫిబ్రవరి 21 – గజ వాహనం
  • ఫిబ్రవరి 22 – చంద్రప్రభ వాహనం
  • ఫిబ్రవరి 23 – 

    ఉదయం: తిరుచ్చి ఉత్సవం, రాత్రి: ఆశ్వ వాహన సేవ

చక్రస్నానం & ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల ముగింపు రోజు ఫిబ్రవరి 24న కార్యక్రమాలు ఇలా జరుగుతాయి:

  • ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు చక్రస్నానం
  • సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం

పుష్పయాగం

ఉత్సవాల అనంతరం ఫిబ్రవరి 25న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించబడుతుంది.

No comments