Telugu Navagraha Temples: తెలుగు రాష్ట్రాల్లో నవగ్రహ దోష నివారణ క్షేత్రాలు – సూర్య నుంచి రాహు కేతువరకు
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. జాతకరీత్యా ఏ ఒక్క గ్రహం అనుకూలించకపోయినా జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే గ్రహ దోషాలను నివారించేందుకు శాస్త్రోక్త పరిహారాలతో పాటు ఆయా గ్రహాలకు సంబంధించిన క్షేత్రాలను దర్శించడం ఎంతో శ్రేయస్కరం. తమిళనాడులో కుంభకోణం సమీపంలో ప్రసిద్ధ నవగ్రహ క్షేత్రాలు ఉన్నప్పటికీ, మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేక శక్తివంతమైన ఆలయాలు ఉన్నాయి.
ఇప్పుడు ఒక్కో గ్రహానికి సంబంధించిన దోష నివారణ క్షేత్రాలను వివరంగా తెలుసుకుందాం.
సూర్య గ్రహం – ఆరోగ్యం, శక్తి
నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. సూర్య దోషం ఉంటే ఆరోగ్య సమస్యలు, శక్తి హీనత కలుగుతాయి.
సూర్య దోష నివారణ క్షేత్రాలు:
- అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం
- పెద్దాపురం సూర్యనారాయణ స్వామి ఆలయం
- గొల్లలమామిడాడ సూర్యనారాయణ స్వామి ఆలయం
- నందికొట్కూరు సూర్యనారాయణ స్వామి ఆలయం
చంద్ర గ్రహం – మనశ్శాంతి
చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఆందోళనలు, భావోద్వేగ సమస్యలు కలుగుతాయి.
చంద్ర దోష నివారణ క్షేత్రాలు:
- సోమేశ్వర స్వామి ఆలయం గునుపూడి
- కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయం
- కనకదుర్గమ్మ ఆలయం
- పెద్దకళ్ళేపల్లి దుర్గాదేవి ఆలయం
- జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం
కుజ గ్రహం – వివాహం, సంతానం
కుజుడు దోషం ఉంటే వివాహం ఆలస్యం, సంతాన సమస్యలు ఎదురవుతాయి.
కుజ దోష నివారణ క్షేత్రాలు:
- మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం
- బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం
- నాగులపాడు పుట్ట
- పొన్నూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం
- యాదగిరి, ధర్మపురి నరసింహ క్షేత్రాలు
బుధ గ్రహం – బుద్ధి, విద్య
బుధ గ్రహ దోషం ఉంటే విద్యలో వెనుకబడటం, బుద్ధి క్షీణత ఉంటుంది.
బుధ దోష నివారణ క్షేత్రాలు:
- ద్వారకా తిరుమల ఆలయం
- ర్యాలి జగన్నాథ స్వామి ఆలయం
- పిఠాపురం కుంతీమాధవ స్వామి ఆలయం
- శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు ఆలయం
- తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం
గురు గ్రహం – విజయం, శ్రేయస్సు
గురు అనుకూలంగా ఉంటే అన్ని రంగాల్లో విజయాలు సాధ్యమవుతాయి.
గురు దోష నివారణ క్షేత్రాలు:
- చేబ్రోలు బ్రహ్మ దేవాలయం
- అలంపురం బ్రహ్మ దేవాలయం
- కోటిపల్లి కోటిలింగేశ్వర స్వామి ఆలయం
- మందపల్లి బ్రహ్మేశ్వర స్వామి ఆలయం
- అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం
- కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి ఆలయం
శుక్ర గ్రహం – సంపద, ఐశ్వర్యం
శుక్ర దోషం ఉంటే ధనం, సౌఖ్యం తగ్గిపోతాయి.
శుక్ర దోష నివారణ క్షేత్రాలు:
- కనకమహాలక్ష్మి ఆలయం
- సింహాచలం లక్ష్మీదేవి ఆలయం
- అలిమేలు మంగాపురం పద్మావతి అమ్మవారి ఆలయం
- పెంచలకోన ఆదిలక్ష్మీదేవి ఆలయం
శని గ్రహం – కష్టాలు, పరీక్షలు
శని భగవానుడు దోషం ఉంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
శని దోష నివారణ క్షేత్రాలు:
- మందపల్లి మందేశ్వర స్వామి ఆలయం
- పావగడ శని ఆలయం
- విజయవాడ శనైశ్చర స్వామి ఆలయం
- నర్సింగోలు శనేశ్వర స్వామి ఆలయం
రాహు – కేతు గ్రహాలు
రాహు, కేతు దోషాలు ఉంటే అపమృత్యు భయాలు, అడ్డంకులు ఎక్కువగా ఎదురవుతాయి.
రాహు-కేతు దోష నివారణ క్షేత్రాలు:
- శ్రీ కాళహస్తి ఆలయం
- మందపల్లి నాగేశ్వర స్వామి ఆలయం
- కనకదుర్గమ్మ ఆలయం
- సంపత్ వినాయక స్వామి ఆలయం
- తెనాలి వైకుంఠపురం వినాయక స్వామి ఆలయం

Post a Comment