Jubilee hills Venkateswara Temple: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2026 – తేదీలు, వాహనసేవలు, ప్రత్యేక ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుంచి 25వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శాస్త్రోక్తంగా ఆరంభం కానుంది.
బ్రహ్మోత్సవాలకు ముందుగా ఫిబ్రవరి 10వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున వేకువజామున స్వామివారిని మేల్కొలిపి, ఆగమోక్త విధానాల ప్రకారం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. ఉదయం 7.00 గంటల నుంచి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించగా, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అదే రోజు ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు భక్తులకు సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8.00 నుంచి 9.00 గంటల వరకు, రాత్రి 7.00 నుంచి 8.00 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల వాహన సేవల వివరాలు
ఫిబ్రవరి 17, 2026
- ఉదయం: ధ్వజారోహణం (మేష లగ్నం – ఉదయం 10.30 నుంచి 11.00 గంటల వరకు)
- రాత్రి: పెద్దశేష వాహనం
ఫిబ్రవరి 18, 2026
- ఉదయం: చిన్నశేష వాహనం
- రాత్రి: హంస వాహనం
ఫిబ్రవరి 19, 2026
- ఉదయం: సింహ వాహనం
- రాత్రి: ముత్యపుపందిరి వాహనం
ఫిబ్రవరి 20, 2026
- ఉదయం: కల్పవృక్ష వాహనం
- రాత్రి: సర్వభూపాల వాహనం
ఫిబ్రవరి 21, 2026
- ఉదయం: పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారం)
- రాత్రి: గరుడ వాహనం (రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు)
ఫిబ్రవరి 22, 2026
- ఉదయం: హనుమంత వాహనం
- రాత్రి: గజ వాహనం
ఫిబ్రవరి 23, 2026
- ఉదయం: సూర్యప్రభ వాహనం
- రాత్రి: చంద్రప్రభ వాహనం
ఫిబ్రవరి 24, 2026
- ఉదయం: రథోత్సవం
- రాత్రి: అశ్వవాహనం
ఫిబ్రవరి 25, 2026
- ఉదయం: చక్రస్నానం (ఉదయం 8.00 నుంచి 10.00 గంటల వరకు)
- రాత్రి: ధ్వజావరోహణం (సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు)
ఫిబ్రవరి 26, 2026
- మధ్యాహ్నం 3.00 గంటలకు పుష్పయాగం
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహన సేవలకు ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Post a Comment