Medaram Jatara 2026: శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2026

సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఘనంగా, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా జరుపుకునే ఉత్సవం.

  • ప్రాముఖ్యత: దీనిని తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాలలో ఒకటి.

  • పాల్గొనే రాష్ట్రాలు: ఈ ఉత్సవంలో దేశ నలుమూల నుండి గిరిజనులు పాల్గొంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు.

భక్తుల విశ్వాసాలు మరియు మొక్కులు

భక్తులు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు తమ కోరికలు తీరుస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు:

  • కోరికలు:

    • సంతానం లేని వాళ్లు సంతానం కోసం మొక్కుకుంటారు.

    • పెళ్లికాని ఆడపిల్లలు మంచి భర్త కోసం అమ్మవారికి పూజలు చేస్తారు.

  • సమర్పణలు (మొక్కు తీరిన తర్వాత): కోరిక తీరిన తరువాత భక్తులు అమ్మవారికి బెల్లం (బంగారం), దూడలు, కొబ్బరికాయలు సమర్పిస్తారు.

  • పవిత్ర స్నానం: జంపన్న వాగులో స్నానం చేయడం ద్వారా భక్తులు తమ పాపాలు పూర్తిగా తొలగిపోయినట్లు నమ్ముతారు.


2026 జాతర తేదీలు 

జనవరి 28 - సారలమ్మ అమ్మవారు గద్దె మీదకు వస్తారు.

జనవరి 29 -సమ్మక్క అమ్మవారు గద్దె మీదకు వస్తారు.

జనవరి 30 - భక్తులకు అమ్మవార్లు దర్శనం,  భక్తులు నైవేద్యం సమర్పిస్తారు.

జనవరి 31 - జాతరలో ఆఖరిరోజు, అమ్మవార్లు మళ్ళీ వనంకి తిరిగి వెళతారు.

Comments

Popular Posts