VYAGHRESHWARA TEMPLE: శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి వారి ఆలయం - పుల్లేటికుర్రు

భారత దేశంలో శైవక్షేత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి క్షేత్రానికీ ఒక విశేషత ఉంటుంది. అలాంటి విశిష్టమైన శైవ తీర్థస్థలాల్లో తూర్పు గోదావరి జిల్లాలో వెలసిన వ్యాఘ్రేశ్వర క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం అంబాజీపేట మండలం, పుల్లేటికుర్రు గ్రామంలో ఉన్నది.

ఆలయ స్థలపురాణం

పూర్వం ఈ ప్రాంతం పెద్దాపురం సంస్థానంలో భాగంగా ఉండేది. పుల్లేటికుర్రు గ్రామం జనసంచారంగా ఉన్నా, పులుల సంచారం ఎక్కువగా ఉండేది. ఓసారి శివభక్తుడైన బ్రాహ్మణుడు మహాశివరాత్రి పర్వదినానికి ముందురోజు మారేడు దళాలు సేకరించేందుకు ఈ గ్రామంలో అడుగు పెట్టాడు. అతడిని ఓ పులి వెంటాడింది. ప్రాణభయంతో పారిపోయిన అతడు ఒక మారేడు చెట్టు మీదకు ఎక్కి కూర్చున్నాడు.

ఆ పులి చెట్టు కింద కాపు కాస్తూ ఉండిపోయింది. అర్ధరాత్రి సమయం అయింది,ఆ పులి చెట్టు కింద కాపు కాస్తూ ఉండిపోయింది. అర్ధరాత్రి సమయం అయింది. శివపూజ ఆలస్యం అవుతోందన్న భయంతో బ్రాహ్మణుడు, పులిని శివునిగా భావించి, మనసులో శివస్తోత్రాలు పఠిస్తూ మారేడు దళాలను పులిపై వేసాడు.

ఆ మారేడు దళాలు గుట్టగా పేరుకుపోయాయి. తెల్లవారిన తర్వాత గ్రామస్తులు వచ్చి దానిని తొలగించగా, అక్కడ శివలింగం వెలిసింది. ఇది చూచి ఆశ్చర్యచెందిన బ్రాహ్మణుడు భక్తితో పూజ చేశాడు.

తర్వాత కాలంలో ఒక మహారాజుకు శివుడు స్వప్నంలో దర్శనమిచ్చి తన ఉనికిని తెలిపాడు. రాజు వెంటనే ఆలయాన్ని నిర్మించించి శివలింగాన్ని ప్రతిష్టించాడు. అప్పటినుంచి ఈ క్షేత్రానికి వ్యాఘ్రేశ్వర క్షేత్రం అనే పేరు లభించింది. ఇక్కడ శివుడు వ్యాఘ్రేశ్వరస్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు.

ఆలయ విశేషాలు
  • శివుడు ఇక్కడ  శ్రీ బాల త్రిపుర సుందరి సమేతంగా వెలసినాడు.
  • ఆలయానికి క్షేత్రపాలకుడిగా  శ్రీ రుక్మిణీ సమేత మదనగోపాలుడు  ఉన్నారు.
  • సమీపంలోనే  వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. 
  • ఇందులో విగ్రహాలు పైభాగంలో మానవరూపంలో, కింద భాగంలో సర్పాకారంలో దర్శనమిస్తాయి.
  • ఇక్కడ భక్తులు కోరికలు తీరిన తర్వాత ఆలయ ప్రాంగణంలో కొబ్బరి మొక్కలు నాటి ముడుపులు చెల్లిస్తారు.
పూజలు, ఉత్సవాలు
  • ప్రతి మాస శివరాత్రికు,మాఘ మాస మహాశివరాత్రికు ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించబడతాయి.
  • కార్తీక మాసం నెలరోజుల పాటు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
భక్తుల విశ్వాసం

ఇక్కడ శివుని దర్శనం వల్ల సకల శుభాలు కలుగుతాయని, కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. అందుకే ఇక్కడి ప్రజలు తమ పేర్లలో "వ్యాఘ్రేశ్వర" అనే పదాన్ని కలిపి పెట్టుకుంటారు. ఇది వారి భక్తిశ్రద్ధకు నిదర్శనం.

ఎలా చేరుకోవాలి

రాజమండ్రి నుండి అమలాపురం వెళ్లే మార్గంలో ఉన్న పుల్లేటికుర్రు గ్రామంకి బస్సులు అందుబాటులో ఉన్నాయి. అక్కడినుంచి ఆలయం సులభంగా చేరుకోవచ్చు.

Comments

Popular Posts