పార్వతీపురం టౌన్‌లోని ప్రముఖ గ్రామ దేవత కొత్తపోలమ్మ అమ్మవారు మహోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని కొత్తవలస గ్రామ ప్రజల ఇలవేల్పైన ఈ అమ్మవారు భక్తుల కోర్కెలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందారు.
ఏడేళ్ల విరామం తర్వాత ఈ వేడుకలను మళ్లీ భక్తుల సహకారంతో నిర్వహించడం విశేషం.
2026 ఉత్సవాల షెడ్యూల్
ఏప్రిల్ 22 – 27
- పురవీధుల్లో అమ్మవారి ఘాటాల ఊరేగింపులు
- సంప్రదాయ కార్యక్రమాలు, భక్తి వేడుకలు
ఏప్రిల్ 26
- సాయంత్రం 5 గంటలకు ఉయ్యాల కంబాల ఉత్సవం
- అనంతరం అమ్మవారి ఘటాల ఊరేగింపుతో రాజుగారి కోటకు ప్రయాణం
ఏప్రిల్ 28
- సాయంత్రం 5 గంటల నుంచి అనుపు పండుగ నిర్వహణ