తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గార్లొడ్డు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం లో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్ 29 నుండి మే 3 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
2026 ఉత్సవాల షెడ్యూల్
ఏప్రిల్ 29
- సుప్రభాత సేవతో బ్రహ్మోత్సవాల ప్రారంభం
ఏప్రిల్ 30
- 11 కలశములతో అభిషేకం
- అగ్ని ప్రతిష్ఠ మహోత్సవం
మే 1
- బాలభోగం
- తీర్థప్రసాద గోష్టి
- స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం
- రాత్రి 9 గంటలకు దివ్య కల్యాణోత్సవం
మే 2
- యాగశాల ఆరాధనలు
మే 3
- చక్రస్నానం
- అభిషేకం
- వేద పారాయణాలతో బ్రహ్మోత్సవాల ముగింపు