నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లిగా, కోరిన కోర్కెలను తీర్చే కరుణామయి తల్లిగా ప్రసిద్ధి చెందారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ క్షేత్రం వేలాది మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా వెలుగొందుతోంది. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని, కుటుంబ కష్టాలు తొలగి ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం లభిస్తాయని భక్తుల నమ్మకం.
ప్రతి ఏడాది నిర్వహించే అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గంగపట్నం గ్రామాన్ని ఆధ్యాత్మిక వైభవంతో నింపేస్తాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయం సుందరంగా అలంకరించబడగా మంగళవాయిద్యాలు, ప్రత్యేక పూజలు, హోమాలు, వాహనసేవలతో క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతుంది. ముఖ్యంగా దూళి జాతర, వివిధ వాహనసేవలు, కల్యాణోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం వంటి కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
బ్రహ్మోత్సవాల కార్యక్రమాల పట్టిక – 2026
జూన్ 21
అంకురార్పణ, ధ్వజారోహణం
జూన్ 22
చప్పర ఉత్సవం
జూన్ 23
చప్పర ఉత్సవం, గజవాహన సేవ
జూన్ 24
చప్పర ఉత్సవం, సింహవాహన సేవ
జూన్ 25
చప్పర ఉత్సవం, పులివాహన సేవ
జూన్ 26
చప్పర ఉత్సవం, అశ్వవాహన సేవ
చప్పర ఉత్సవం
జూన్ 28
సింహవాహన సేవ
జూన్ 29
కల్యాణోత్సవం
జూన్ 30
వసంతోత్సవం, గంగోత్సవం
జూలై 1
రథోత్సవం
జూలై 2
తెప్పోత్సవం
