తెలంగాణ రాష్ట్రంలోని భద్రకాళీ దేవస్థానం వరంగల్ నగరంలో ఉన్న ప్రముఖ శక్తి క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం వరంగల్-హన్మకొండ రహదారిపై, పాలిటెక్నిక్ కాలేజీ నుండి సుమారు 1.5 కి.మీ దూరంలో, భద్రకాళీ చెరువు తీరాన గుట్టల మధ్య అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ప్రశాంత వాతావరణంలో విరాజిల్లుతోంది.
ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతాయి.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్ – 2026
ఏప్రిల్ 19
అంకురార్పణ, గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం మూషిక వాహన సేవ, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజ జరుగగా, సాయంత్రం నెమలి వాహన సేవ నిర్వహిస్తారు.
ఏప్రిల్ 20
ధ్వజారోహణంతో పాటు ఉదయం వృషభ వాహన సేవ, సాయంత్రం మృగ వాహన సేవ జరుగుతాయి.
ఏప్రిల్ 21
ఎదురుకోలు కార్యక్రమంతో పాటు ఉదయం మకర వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు.
ఏప్రిల్ 22
ఈ రోజు ప్రధాన ఘట్టమైన శ్రీ భద్రకాళి–భద్రేశ్వరుల కల్యాణోత్సవం సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. ఉదయం సింహ వాహన సేవ, సాయంత్రం గజ వాహన సేవ ఉంటాయి.
ఏప్రిల్ 23
సదస్యం కార్యక్రమంతో పాటు సూర్యప్రభ, హంస వాహన సేవలు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 24
పల్లకి సేవ, శేష వాహన సేవలు భక్తులను ఆకట్టుకుంటాయి.
ఏప్రిల్ 25
గంధోత్సవం, శాలభంజిక సేవలు జరుగుతాయి.
ఏప్రిల్ 26
హరిద్రోత్సవంతో పాటు అత్యంత ముఖ్యమైన రథోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది
ఏప్రిల్ 27
డోలోత్సవం, అశ్వ వాహన సేవలు జరుగుతాయి.
ఏప్రిల్ 28
వసంతోత్సవం, చతుర్నాథ సేవ, విమానక సేవ నిర్వహిస్తారు.
ఏప్రిల్ 29
మహా పూర్ణాహుతి, శరభ వాహన సేవ, పుష్పరథ సేవలు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 30
చక్రస్నానం, ధ్వజావరోహణం, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
శ్రీ భద్రకాళి అమ్మవారు బ్రహ్మోత్సవాలు దివ్య శక్తి, మాతృ రక్షణకు ప్రతీక. ప్రతి వాహన సేవ అమ్మవారి విభిన్న శక్తి స్వరూపాలను సూచిస్తుంది. కల్యాణోత్సవం, రథోత్సవం వంటి ప్రధాన కార్యక్రమాలు భక్తులకు ఐశ్వర్యం, శాంతి ప్రసాదిస్తాయని విశ్వాసం.
