చిత్తూరు కామాక్షీ సమేత అగస్తీశ్వర ఆలయం బ్రహ్మోత్సవాలు 2026 – పంగుణి మాస ఉత్సవ షెడ్యూల్

చిత్తూరు నగరంలోని ప్రసిద్ధ కామాక్షీ సమేత అగస్తీశ్వర ఆలయం లో పంగుణి మాస వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల మార్చి 22వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆలయ నిర్వాహకులు వెల్లడించిన కార్యక్రమాల ప్రకారం భక్తిరసంతో నిండిన పలు వాహనసేవలు, ఉత్సవాలు నిర్వహించనున్నారు.

2026 బ్రహ్మోత్సవాల కార్యక్రమాల వివరాలు

మార్చి 22వ తేదీ – గ్రామోత్సవం, విఘ్నేశ్వర ఉత్సవం
23వ తేదీ – ధ్వజారోహణం
24వ తేదీ – యాళి, హంస, సింహ వాహన సేవలు
25వ తేదీ – (వాహన సేవలు)
26వ తేదీ – భూత, శేష వాహనాలు
27వ తేదీ – కేడియ, కామధేను, అధికార నంది, వృషభ వాహనాలు
28వ తేదీ – కేడియ, ఏనుగు వాహనాలు
29వ తేదీ – రథోత్సవం, నీవా నది జలాభిషేకం
30వ తేదీ – భిక్షాండి, స్వామివారి కల్యాణోత్సవం, గుర్రపు వాహనం
31వ తేదీ – సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు
ఏప్రిల్ 1 – నటరాజ స్వామి ఉత్సవం, తీర్థవారి
ఏప్రిల్ 2 – మహాభిషేకం, పుష్పపల్లకి సేవలతో ఉత్సవాల ముగింపు

ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వడం విశేషం. ముఖ్యంగా రథోత్సవం, కల్యాణోత్సవం, పుష్పపల్లకి సేవలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.

No comments