Phalguna Masam 2026 Festivals: ఫాల్గుణ మాసం 2026 పండుగలు, పర్వదినాలు, పుణ్య తిధులు పూర్తి జాబితా
భారతీయ సనాతన సంప్రదాయంలో ఫాల్గుణ మాసానికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. భాగవత పురాణం ప్రకారం ఈ మాసం మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడింది.
తెలుగు పంచాంగం ప్రకారం చైత్రాది మాసాల క్రమంలో చివరిది ఫాల్గుణం. సంవత్సరం పొడవునా ఆచరించిన దేవతా పూజలు, వ్రతాలు, నోములు ఈ మాసంలో మరోసారి సమాహారంగా దర్శనమివ్వడం విశేషం. అందుకే ఫాల్గుణ మాసాన్ని “సర్వదేవతా వ్రత సమాహారం” అని పిలుస్తారు.
2026 ఫాల్గుణ మాస ప్రారంభం – ముగింపు
- ఫిబ్రవరి 18, 2026 – ఫాల్గుణ శుద్ధ పాడ్యమి → మాసారంభం
- మార్చి 18, 2026 – ఫాల్గుణ అమావాస్య → మాస సమాప్తి
ఈ రోజుతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కూడా ముగుస్తుంది.
ఫాల్గుణ మాస ప్రధాన ఆచారం
పయోవ్రతం
ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి విష్ణు ప్రీతి కోసం పయోవ్రతం ఆరంభించడం శాస్త్రోక్తం.
ఫాల్గుణ మాస పండుగలు & పర్వదినాలు
ఫిబ్రవరి 18 – బుధవారం
ఫాల్గుణ శుద్ధ పాడ్యమి
- ఫాల్గుణ మాస ప్రారంభం
- పయోవ్రతం ఆరంభం
ఫిబ్రవరి 19 – గురువారం
శుద్ధ విదియ
- చంద్రోదయం
ఫిబ్రవరి 21 – శనివారం
శుద్ధ చవితి
- దుండి గణపతి పూజ
ఫిబ్రవరి 27 – శుక్రవారం
శుద్ధ ఏకాదశి
- అమలక ఏకాదశి
ఫిబ్రవరి 28 – శనివారం
శుద్ధ ద్వాదశి
- నృసింహ ద్వాదశి
మార్చి 1 – ఆదివారం
శుద్ధ త్రయోదశి
- భీమ జననం
- పక్ష ప్రదోషం
మార్చి 2 – సోమవారం
చతుర్దశి / పౌర్ణమి
- హోళికా పౌర్ణమి
- కామ దహనం
మార్చి 3 – మంగళవారం
పౌర్ణమి
- కుమారధార తీర్థ ముక్కోటి
- శ్రీలక్ష్మీ జయంతి
మార్చి 4 – బుధవారం
బహుళ పాడ్యమి
- వసంతోత్సవం
మార్చి 7 – శనివారం
బహుళ చవితి
- సంకష్టహర చవితి
మార్చి 14 – శనివారం
బహుళ ఏకాదశి
- పాపవిమోచన ఏకాదశి
- మీన సంక్రమణం
మార్చి 16 – సోమవారం
బహుళ త్రయోదశి
- పక్ష ప్రదోషం
మార్చి 17 – మంగళవారం
బహుళ చతుర్దశి
- మాస శివరాత్రి
మార్చి 18 – బుధవారం
బహుళ అమావాస్య
- ఫాల్గుణ మాస సమాప్తి
- శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ముగింపు
ఫాల్గుణ మాస ఆధ్యాత్మిక ప్రాముఖ్యం
- విష్ణు ఆరాధనకు అత్యుత్తమ కాలం
- ఏకాదశి వ్రతాలకు విశేష ఫలప్రదం
- దాన, జప, హోమాలకు పుణ్యకాలం
- హోలీ, కామదహనం వంటి పండుగల సమాహారం

Post a Comment