Nagalapuram Vedanarayana Temple Samprokshanam: నాగలాపురం వేదనారాయణస్వామి ఆలయం విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ 2026
చిత్తూరు జిల్లా నాగలాపురంలో వెలసిన ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుంచి 22వ తేదీ వరకు వైభవంగా విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ విమాన గోపురం, గర్భగుడి పవిత్రత పునరుద్ధరణార్థం జరిగే ఈ మహా కైంకర్యాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
2026 ఉత్సవ కార్యక్రమాల వివరాలు
ఫిబ్రవరి 17 – ప్రారంభ వైదిక కార్యక్రమాలు
సాయంత్రం 5.30 గంటలకు ఆచార్య ఋత్విక్ వరణం, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం కార్యక్రమాలతో మహోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టనున్నారు.
ఫిబ్రవరి 18 – అష్టబంధనాది కర్మలు
ఉదయం అష్టబంధన సమర్పణ జరుగుతుంది. సాయంత్రం పుణ్యాహవచనం, పంచాగ్ని ప్రతిష్ఠ, కుంభవాహనం, ఆరాధన, హోమం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 19 – అధివాస క్రతువులు
పంచగవ్యాధివాసం, నవకలశ స్నపనం కార్యక్రమాలు వైదిక పండితుల మంత్రోచ్చారణల మధ్య జరుగుతాయి.
ఫిబ్రవరి 20 – క్షీరాబ్ధివాసం
ఉదయం క్షీరాబ్ధివాసం నిర్వహించి, సాయంత్రం యాగశాలలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు, హోమాలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 21 – జలాధివాసం, మహాశాంతి
ఉదయం జలాధివాసం, సాయంత్రం మహాశాంతి తిరుమంజనం ఘనంగా జరుగుతుంది.
ఫిబ్రవరి 22 – మహాసంప్రోక్షణ మహోత్సవం
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాజగోపుర సంప్రోక్షణం
- ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గర్భాలయ మూలవర్ల మహాసంప్రోక్షణం
అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.

Post a Comment