2026 ఉత్సవాల కార్యక్రమ వివరాలు:
- ఫిబ్రవరి 22వ తేదీ – ఉదయం శేషవాహన సేవ, సాయంత్రం కల్పవృక్ష వాహన సేవ
- 23వ తేదీ – ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ
- 24వ తేదీ – ఉదయం హనుమద్వాహన సేవ, సాయంత్రం గరుడవాహన సేవ
- 25వ తేదీ – గజవాహన సేవ, హంస వాహన సేవ
- 26వ తేదీ – ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం అశ్వవాహన సేవ
- ఫిబ్రవరి 27వ తేదీ – సమాప్తి కార్యక్రమాలు, పూర్ణాహుతి
ఎలా చేరుకోవాలి?
ఈ పవిత్ర క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగర శివారులోని మామిదాలపాడు గ్రామంలో ఉంది.
- బస్సు మార్గం: కర్నూలు నూతన బస్ స్టాండ్ నుంచి సుమారు 8 కి.మీ. దూరంలో ఆలయం ఉంది. స్థానిక బస్సులు, షేరింగ్ ఆటోలు అందుబాటులో ఉంటాయి.
- రైలు మార్గం: కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 10 కి.మీ. దూరం. స్టేషన్ బయట నుంచి ఆటోలు, క్యాబ్ సదుపాయం లభ్యం.
- రోడ్డు మార్గం: నగర కేంద్రం నుంచి వ్యక్తిగత వాహనాలతో సులభంగా చేరుకోవచ్చు. ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో క్షేత్రం విరాజిల్లుతోంది.
