వరంగల్ రామన్నపేట శ్రీ బాలనగర వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 2026 షెడ్యూల్
వరంగల్ నగరంలోని బట్టలబజార్ రామన్నపేటలో వెలసిన శ్రీ బాలనగర వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి
2026 ఉత్సవాల కార్యక్రమ వివరాలు:
- ఫిబ్రవరి 24 – ఉత్సవ ఆరంభ స్వపనం, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ ధ్వజ కుంభారాధన
- ఫిబ్రవరి 25 – స్వామివారి శేషవాహన సేవ; సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఓరుగల్లు సౌందర్యలహరి బృందం చేత శ్రీమన్నారాయణ నీయపారాయణం
- ఫిబ్రవరి 26 – హంస వాహనసేవ, సుదర్శన నరసింహ హోమం; సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం
- ఫిబ్రవరి 27 – ఎదుర్కోలు ఉత్సవం, గజవాహన సేవ, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవం
- ఫిబ్రవరి 28 – రథోత్సవం, శ్రీ మహాలక్ష్మీ హోమం
- మార్చి 1 – మహాపూర్ణాహుతి, నవకలశ స్వపనం, చక్రతీర్థం, శ్రీ పుష్పయాగం
ఎలా చేరుకోవాలి?
- బస్సు మార్గం: వరంగల్ బస్ స్టాండ్ నుంచి సుమారు 3 కి.మీ. దూరంలో ఆలయం ఉంది. నగర బస్సులు, ఆటోలు సులభంగా లభిస్తాయి.
- రైలు మార్గం: వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 4 కి.మీ. దూరంలో దేవాలయం ఉంది. స్టేషన్ వెలుపల నుంచి ఆటోలు, క్యాబ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
- రోడ్డు మార్గం: హన్మకొండ నుంచి సుమారు 6 కి.మీ., కాజీపేట నుంచి సుమారు 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యక్తిగత వాహనాలతో సులభంగా చేరుకోవచ్చు.
Post a Comment