మేడ్చల్ రామలింగేశ్వర స్వామి గుట్ట జాతర & వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 షెడ్యూల్

మేడ్చల్ పట్టణంలోని చారిత్రక రామలింగేశ్వర స్వామి గుట్ట జాతరకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఆలయ ఉత్సవ కమిటీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి  27 నుంచి మూడు రోజులపాటు జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.

ఆలయ చరిత్ర, మహిమ

నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం కాకతీయుల కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. సుమారు 60 మీటర్ల ఎత్తైన గుట్టపై రెండు భారీ బండల మధ్య చీకటి గుహలో లింగరూపంలో స్వయంభువుగా శివుడు వెలిసినట్లు స్థానికుల విశ్వాసం.

ప్రధాన ఆలయంతో పాటు రంగనాయక స్వామి, ఆంజనేయ స్వామి, కాశీ విశ్వనాథ్, వీరభద్రస్వామి ఉపాలయాలు నిర్మించబడ్డాయి. శివరాత్రి, బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా భక్తులు రామలింగేశ్వరుని కొలుస్తారు.

గుట్ట కింద ఉన్న ప్రాచీన గుండం కూడా విశేష ప్రాధాన్యం కలిగింది. కాకతీయుల కాలంలో రాతితో మూడు అంచెలుగా తవ్వించిన ఈ బావి ఎన్నో వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎండిపోకుండా నిండుజలంతో కళకళలాడుతుందని చెబుతారు.

2026 బ్రహ్మోత్సవాల షెడ్యూల్

  • ఫిబ్రవరి 21వ తేదీ (శనివారం) – అంకురార్పణ, గణపతి పూజ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, నందీశ్వర సేవ
  • 22వ తేదీ – భృంగీశ్వర సేవ
  • 23వ తేదీ – హంసవాహన సేవ
  • 24వ తేదీ – అశ్వవాహన సేవ
  • 25వ తేదీ – కల్యాణోత్సవం
  • 26వ తేదీ – గజవాహన సేవ, అగ్నిగుండాలు
  • ఫిబ్రవరి 27వ తేదీ – దోపు సేవ, జాతర, లంకాదహనం

ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గం ద్వారా:

  • హైదరాబాద్ నుంచి సుమారు 30 కి.మీ
  • సికింద్రాబాద్ నుంచి సుమారు 25 కి.మీ
  • హైదరాబాద్–నాగ్‌పూర్ జాతీయ రహదారి (NH-44)పై ఉండటం వల్ల ఆర్టీసీ బస్సులు, క్యాబ్ సౌకర్యాలు సులభంగా లభిస్తాయి.
  • మేడ్చల్ బస్టాండ్ నుంచి ఆలయానికి స్థానిక ఆటోలు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం ద్వారా:

  • సమీప రైల్వే స్టేషన్: మేడ్చల్ (సుమారు 3–4 కి.మీ)
  • సికింద్రాబాద్ జంక్షన్ నుంచి స్థానిక రైళ్లు అందుబాటులో ఉంటాయి.

విమాన మార్గం:

  • సమీప విమానాశ్రయం: హైదరాబాద్ (సుమారు 65 కి.మీ)

ఆలయ ప్రత్యేకతలు

  • కాకతీయుల కాలానికి చెందిన సుమారు నాలుగు శతాబ్దాల చరిత్ర గల ప్రాచీన శైవక్షేత్రం.
  • 60 మీటర్ల ఎత్తైన గుట్టపై రెండు బండల మధ్య గుహలో స్వయంభువుగా వెలసిన లింగరూప శివుడు.
  • గుట్టపై నుంచి కనిపించే ప్రకృతి దృశ్యాలు భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తాయి.
  • రంగనాయక స్వామి, ఆంజనేయ స్వామి, కాశీ విశ్వనాథ్, వీరభద్రస్వామి ఉపాలయాలు ప్రత్యేక ఆకర్షణలు.
  • గుట్ట కింద ఉన్న కాకతీయుల కాలం నాటి రాతి గుండం (బావి) ఎండిపోకపోవడం విశేషం.
  • శివరాత్రి, బ్రహ్మోత్సవాల సమయంలో వేలాది భక్తులు తరలివచ్చే ప్రముఖ జాతర స్థలం.

No comments