తిరుచానూరు, అప్పలాయగుంట, వాల్మీకిపురం ఆలయాలలో మార్చి 2026 ఉత్సవాలు – పూర్తి షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్రక్షేత్రం తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో మార్చి నెలలో భక్తుల కోసం అనేక విశేష ఉత్సవాలు, సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడనున్నాయి. ఉగాది, నక్షత్రోత్సవాలు, శుక్రవారం తిరుచ్చి ఉత్సవాలు వంటి ప్రత్యేక వేడుకలతో ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడనుంది.

 మార్చి 3 – చంద్రగ్రహణం

  • ఉదయం 9.00 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూత
  • ఈ సమయంలో సాధారణ దర్శనాలు, సేవలు నిలిపివేయబడతాయి.

మార్చి 14 – ఉత్తరాషాడ నక్షత్రం

  • సాయంత్రం 6.45 గంటలకు గజవాహనంపై అమ్మవారి విహారం
  • ఆలయ మాడ వీధుల్లో ఉత్సవ మూర్తి దర్శనమిచ్చి భక్తులను కటాక్షించనున్నారు.

శుక్రవారం తిరుచ్చి ఉత్సవాలు

మార్చి 6, 13, 20, 27 తేదీలు

  • సాయంత్రం 6.00 గంటలకు తిరుచ్చి ఉత్సవం
ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో ఉత్సవం నిర్వహించబడుతుంది.

మార్చి 19 – ఉగాది మహోత్సవం

  • సాయంత్రం 6.00 గంటలకు పుష్ప పల్లకీపై విహారం
  • రాత్రి 8.00 గంటలకు పంచాంగ శ్రవణం, ఆస్థానం

ఉగాది సందర్భంగా అమ్మవారు పుష్పాలంకృత పల్లకీలో మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఇతర ఆలయాలలో విశేషాలు

శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయం

  • మార్చి 24 (రోహిణి నక్షత్రం)
రాత్రి 7.00 గంటలకు తిరుచ్చి ఉత్సవం

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం

  • మార్చి 6 (హస్త నక్షత్రం)
సాయంత్రం 5.00 గంటలకు తిరుచ్చి ఉత్సవం

శ్రీ శ్రీనివాస స్వామి ఆలయం

  • మార్చి 19 – సాయంత్రం 5.00 గంటలకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం
  • మార్చి 7, 14, 21, 28 తేదీలు – ఉదయం 8.00 గంటలకు అభిషేకం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం

మార్చి 3 – చంద్రగ్రహణం

  • ఉదయం 9.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఆలయం మూత
  • అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు

మార్చి 19 – ఉగాది

  • ఉదయం 8.00 గంటలకు తిరువీధి ఉత్సవం
  • ఉదయం 9.00 గంటలకు ఉగాది ఆస్థానం
  • ఉదయం 10.00 గంటలకు పంచాంగ శ్రవణం

శుక్రవారం ప్రత్యేక సేవలు (మార్చి 6, 13, 20, 27)

  • ఉదయం 7.00 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం

మార్చి 11

  • ఉదయం 8.00 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం

మార్చి 15 – శ్రవణ నక్షత్రం

  • ఉదయం 10.30 గంటలకు కల్యాణోత్సవం

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి సేవలు

మార్చి 1, 8, 15, 22, 29 తేదీలు

  • ఉదయం 8.15 గంటలకు అభిషేకం

No comments