Punganur Kalyana Venkataramana Swamy Temple: పుంగనూరు శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు 2026 – ఉత్సవ షెడ్యూల్, విశేషాలు

అన్నమయ్య జిల్లా పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం 9.50 గం.ల నుండి 10.45 గం.ల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ముందుగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను గరుడ ధ్వజపటంతో ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి, గరుత్మంతుని చిత్రంతో కూడిన పటానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజస్తంభంపై అధిష్టింపజేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టం వైభవంగా జరిగింది.

రాత్రి 7 గంటలకు పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించనున్నారు.

ఆలయ అలంకరణలు & ఏర్పాట్లు

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు చలువ పందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేసి శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయం మరియు మాడ వీధుల్లో విద్యుత్‌, పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ప్రతి రోజు:

  • ఉదయం 8 నుండి 11 గంటల వరకు
  • రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహించబడతాయి.

2026 వాహనసేవల  వివరాలు

24.02.2026

రాత్రి – పెద్ద శేష వాహనం

25.02.2026

ఉదయం – చిన్న శేష వాహనం
రాత్రి – హంస వాహనం

26.02.2026

ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం

27.02.2026

ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – హనుమంత వాహనం

28.02.2026

ఉదయం – మోహినీ ఉత్సవం
రాత్రి – గరుడ వాహనం

01.03.2026

ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం

02.03.2026

ఉదయం 11 గం.ల నుండి మధ్యాహ్నం 1 గం.ల వరకు – కళ్యాణోత్సవం
రాత్రి – గజ వాహనం

03.03.2026

చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 నుండి రాత్రి 7 వరకు ఆలయం మూసివేత
రాత్రి 8.30 గం.లకు – అశ్వ వాహనం

04.03.2026

ఉదయం 9 గం.లకు – రథోత్సవం
మధ్యాహ్నం 12.45 నుండి 2 గం.ల వరకు మిధున లగ్నంలో చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం

05.03.2026

ఉదయం 10 గం.లకు – తిరుప్పావడ సేవ
రాత్రి 7.30 గం.లకు – శయనోత్సవం

No comments