Rathasaptami: రథసప్తమి 2026 – మాఘసప్తమి, సూర్య జయంతి ఉత్సవాలు
రథసప్తమిని మాఘసప్తమి అని కూడా అంటారు. ఇది మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి తిథి కావడంతో మాఘసప్తమి అనే పేరు వచ్చింది. ఈ రోజును సూర్యభగవానుని జన్మదినంగా భావించి సూర్య జయంతి అని కూడా పిలుస్తారు.
మాఘసప్తమి రోజున సూర్యభగవానుడు తన రథాన్ని ఉత్తర దిశ వైపు మళ్లిస్తాడు అని విశ్వాసం. అందుకే ఈ పండుగకు రథసప్తమి అనే పేరు వచ్చింది. ఈ పండుగను భారతదేశమంతటా హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా సూర్య దేవాలయాలలో రథసప్తమి ఉత్సవాలు ముందుగానే ప్రారంభమవుతాయి.
రథసప్తమితో వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. కొంతమంది రైతులు దీనిని సాగుకు అనువైన శుభకాలంగా భావిస్తారు. రథసప్తమి తరువాత దక్షిణ భారతదేశంలో క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
సూర్య రథం యొక్క తాత్విక అర్థం
సూర్యభగవానుని రథానికి ఉన్న
-
ఏడు తెల్ల గుర్రాలు – ఇంద్రధనస్సులోని ఏడు రంగులు మరియు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి
-
పన్నెండు చక్రాలు – సంవత్సరంలోని పన్నెండు నెలలకు ప్రతీక
పురాణ కథలు
పురాణాల ప్రకారం:
-
శ్రీరామచంద్రుడు రావణుని సంహరించడానికి ముందు సూర్యభగవానుని పూజించి ఆదిత్య హృదయం పఠించాడు
-
మహాభారతంలో కుంతీదేవి సూర్యభగవానుని పూజించడంతో కర్ణుడు జన్మించాడు
-
ధర్మరాజు సూర్యారాధన వల్ల అక్షయ పాత్రను పొందాడు
-
హనుమంతుడు సూర్యభగవానుని వద్దే నవ వ్యాకరణం నేర్చుకున్నాడు
-
భీష్మ పితామహుడు రథసప్తమి తరువాత రోజున శరీరత్యాగం చేశాడు
రథసప్తమి పూజ విధానం
రథసప్తమి రోజున:
-
ఉదయాన్నే స్నానం చేసి సూర్యనమస్కారం చేయాలి
-
నైవేద్యంతో పాటు పండ్లు సమర్పించి సూర్యభగవానుని పూజించాలి
-
ఆదిత్యహృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రనామం వంటి స్తోత్రాలు పఠించాలి
-
సూర్యోదయం తరువాత సుమారు ఒక గంటకు పూజ చేస్తే శుభఫలితం లభిస్తుందని విశ్వాసం
రథసప్తమి ఫలితం
ఈ రోజున సూర్యారాధన చేయడం వల్ల:
-
ఈ జన్మలో చేసిన పాపాలు
-
గత జన్మ పాపాలు
-
మనసుతో, మాటలతో, శరీరంతో చేసిన పాపాలు
-
తెలిసీ, తెలియక చేసిన పాపాలు
అన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
అలాగే అనారోగ్యాలు తొలగి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు లభిస్తాయని నమ్మకం.
రథసప్తమి ఉత్సవాలు
రథసప్తమి వేడుకలు:
-
తిరుమల
-
శ్రీరంగం
-
మేలుకొట్టే
వంటి ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ఘనంగా జరుగుతాయి.
అలాగే:
-
ఆంధ్రప్రదేశ్‌లోని అరసవల్లి సూర్య దేవాలయం
-
ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం
లో కూడా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.
తిరుమల రథసప్తమి ప్రత్యేకత
తిరుమలలో రథసప్తమి రోజున శ్రీవారికి ఒక రోజు బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. దీనిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు.
సప్తమి అంటే ఏడు కనుక, స్వామివారు ఏడు వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు.
వాహన క్రమం:
-
సూర్యప్రభ వాహనం
-
శేష వాహనం
-
గరుడ వాహనం
-
హనుమంత వాహనం
-
కల్పవృక్ష వాహనం
-
సర్వభూపాల వాహనం
-
చంద్రప్రభ వాహనం
రథసప్తమి – 2026
తేదీ: 25 జనవరి 2026

Post a Comment