Pedda Chintarevula Anjaneya Swamy Temple: పెద్దచింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు 2026

 

జోగుళాంబ గద్వాల జిల్లా, ధరూర్ మండలం పెద్దచింతరేవుల గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏ చిన్న కోరికైనా తీర్చే స్వామిగా భక్తులు విశ్వసించే ఈ ఆలయానికి ప్రతి ఏడాది నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ తదియ నాడు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 28 వరకు జరుగుతాయి.

బ్రహ్మోత్సవాల కార్యక్రమాల వివరాలు:

  • 21 (బుధవారం): ధ్వజారోహణం, అంకురార్పణ పూజలతో ప్రారంభం
  • 22: ఉపనయనం, రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం, ప్రభోత్సవం
  • 23 (శుక్రవారం): రాత్రి 10 గంటలకు రథోత్సవం
  • 24 (శనివారం): ప్రభోత్సవం
  • 25: అవభృత స్నానం
  • 26: భీష్మాష్టమి
  • 27: మధ్యనవమి
  • 28 (బుధవారం): పల్లకీసేవ, స్వస్తివచనంతో ముగింపు

బ్రహ్మోత్సవాల్లో తెప్పోత్సవం, ప్రభోత్సవం, రథోత్సవం, పల్లకీసేవ ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి.

ఆలయ విశేషాలు:

పెద్దచింతరేవుల గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని వ్యాసరాయలు ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయానికి సుమారు 750 సంవత్సరాల చరిత్ర ఉంది. శేషదాసుల ద్వారా ఈ స్వామి దర్శనం బాహ్య ప్రపంచానికి పరిచయమైందని చరిత్రకారులు పేర్కొంటున్నారు.

No comments