Madhwa Navami: మధ్వ నవమి

భారతీయ తాత్విక సంప్రదాయంలో ధార్మికవాదాన్ని ముందుకు తీసుకువెళ్లిన ప్రధాన సిద్ధాంతాల్లో ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ముఖ్యమైనవి. వీటిలో శ్రీ విష్ణువు సర్వోత్తముడు అనే సర్వోన్నత తత్వాన్ని ప్రతిష్టించిన ద్వైతవాద సిద్ధాంతాన్ని ప్రబోధించిన మహానుభావుడు శ్రీ మద్వాచార్యులు.

మద్వాచార్యుల జీవన విశేషాలు

శ్రీ మద్వాచార్యులు క్రీ.శ. 1238లో కర్ణాటక రాష్ట్రంలోని పాజక అనే ప్రాంతంలో జన్మించారు. వీరిని పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ అనే పేర్లతో కూడా పిలుస్తారు. మద్వాచార్యుల రచనలు “సర్వమూల గ్రంథాలు”గా ప్రసిద్ధి చెందాయి.

ద్వైత సిద్ధాంత సారాంశం

మద్వాచార్యులు ప్రబోధించిన ద్వైత సిద్ధాంతం ప్రకారం:

  • శ్రీహరి సర్వోత్తముడు,
  • జీవులలో ఉత్తముడు వాయుదేవుడు,
  • భక్తియే మోక్షానికి మార్గం

అనే సత్యాలను స్పష్టంగా వివరించారు.

ధార్మిక ప్రచారం

మద్వాచార్యులు ఆసేతు హిమాచలం వరకు కాలినడకన పర్యటిస్తూ, వైష్ణవ ధర్మం యొక్క యథార్థ స్వరూపాన్ని ప్రజలకు వివరించి ప్రచారం చేశారు. ఉపనిషత్తులకు భాష్యాలు చెబుతూ, స్వామివారు సశరీరంగా అదృశ్యమయ్యారని భక్తుల విశ్వాసం.

మధ్వ నవమి ప్రాముఖ్యత

శ్రీ మద్వాచార్యులు అదృశ్యమైన రోజు మాఘ శుద్ధ నవమి. ఈ పర్వదినాన్ని మధ్వ నవమిగా భక్తులు ఘనంగా జరుపుకుంటారు. మధ్వ నవమి ఉత్సవాలను సాధారణంగా 9 రోజుల పాటు (నవదినోత్సవాలుగా) నిర్వహిస్తారు.

ఉత్సవాల నిర్వహణ

మధ్వ సంప్రదాయాన్ని అనుసరించే మఠాలలోనే కాకుండా, దేశ విదేశాల్లో కూడా మధ్వ నవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా:

  • ఉడిపి – అనంతేశ్వర ఆలయం
  • మంత్రాలయం – శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సన్నిధి

లో మధ్వ నవమి సంబరాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడతాయి.

మధ్వ నవమి – 2026

తేదీ: జనవరి 27, 2026

No comments