Govindraja Swamy Teppotsavam 2026: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం తెప్పోత్సవాలు 2026 – జనవరి 26 నుండి ఫిబ్రవరి 01 వరకు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఏడు రోజుల పాటు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
తెప్పోత్సవాల రోజువారీ వివరాలు
- జనవరి 26 – శ్రీ కోదండరామస్వామివారు
- జనవరి 27 – శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు
- జనవరి 28 – శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు
- జనవరి 29 – శ్రీ ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు
- జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 – అమ్మవార్లతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు
ప్రత్యేక విశేషం
చివరి రోజు తెప్పోత్సవం అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారు ఎదురు ఆంజనేయస్వామివారి సన్నిధికి వేంచేపు చేస్తారు.

Post a Comment