Bhadrachalam Temple Magha Masa Utsavam: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి మాఘమాస ఉత్సవాలు 2026
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మాఘమాసంలో నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నెల 23 నుంచి భక్తరామదాసు జయంతి సందర్భంగా వాగ్గేయకారోత్సవాలు ప్రారంభమవుతాయని, ఇవి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు.
2026 ఉత్సవాల్లో భాగంగా,
- ఈ నెల 25న రథసప్తమి సందర్భంగా ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారికి సేవ,
- 30న సహస్ర కలశాభిషేకానికి అంకురార్పణ,
- 31న సహస్ర కలశాభిషేక ఆవాహన,
- ఫిబ్రవరి 1న సహస్ర కలశాభిషేకం,
- ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు కూరత్తాళ్వాన్ తిరునక్షత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
అలాగే సహస్ర కలశాభిషేక మహోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 31 మరియు ఫిబ్రవరి 1 తేదీల్లో నిత్య కళ్యాణాలు రద్దు చేసారు.

Post a Comment