Thondapadu Ranganatha Swamy Temple: తొండపాడు రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు 2026 – ఉత్సవాల తేదీలు, రథోత్సవం, ప్రత్యేకతలు

 

గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్నాయి.

ఈ బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. గ్రామ సమీపంలోని శ్వేతగిరి కొండపై వందల సంవత్సరాల క్రితం శ్రీ రంగనాథస్వామి వెలిసినట్లు చరిత్ర చెబుతోంది.
రథోత్సవం రోజున కొండపై అఖండ దీపారాధన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి ఏటా మాఘమాసంలో ఈ ఉత్సవాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు.

దాదాపు తొమ్మిది రోజుల పాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథస్వామి వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.

2026 బ్రహ్మోత్సవాల కార్యక్రమ వివరాలు

  • ఈనెల 26న (మొదటి రోజు): జక్కలచెరువు గ్రామం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథస్వామిని పెళ్లికుమారుడిగా ముస్తాబు చేసి, పల్లకిలో తొండపాడు గ్రామానికి తీసుకువస్తారు. అదే రోజు రాత్రి ధ్వజారోహణ, అంకురార్పణ నిర్వహిస్తారు.
  • 27న: సింహవాహన సేవ
  • 28న: శేషవాహన సేవ
  • 29న: హనుమత్ వాహన సేవ
  • 30న: గరుడ వాహన సేవ
  • 31న: గజవాహన సేవ
  • ఫిబ్రవరి 1న: తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు కల్యాణోత్సవం, సాయంత్రం 4 గంటలకు రథోత్సవం

  • ఫిబ్రవరి 2న: పార్వేట, అశ్వవాహన సేవ
  • ఫిబ్రవరి 3న: వసంతోత్సవం, హంసవాహన సేవతో బ్రహ్మోత్సవాల ముగింపు

ఎలా చేరుకోవాలి ?

తొండపాడు శ్రీ రంగనాథస్వామి ఆలయానికి చేరుకునే మార్గాలు

రోడ్డు మార్గం ద్వారా:

  • గుత్తి (గూటీ) నుంచి: సుమారు 10 కిలోమీటర్లు
  • అనంతపురం నుంచి: సుమారు 55 కిలోమీటర్లు
  • బెంగళూరు నుంచి: సుమారు 250 కిలోమీటర్లు

గుత్తి నుంచి తొండపాడు గ్రామానికి ఆర్టీసీ బస్సులు, ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

బస్సు మార్గం ద్వారా:

  • అనంతపురం – గుత్తి వరకు తరచుగా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి.
  • గుత్తి బస్‌స్టాండ్ నుంచి తొండపాడుకు స్థానిక బస్సులు / ఆటోలు లభిస్తాయి.

రైలు మార్గం ద్వారా:

  • సమీప రైల్వే స్టేషన్: గుత్తి జంక్షన్ (సుమారు 10 కిలోమీటర్లు)
  • హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి గుత్తికి రైలు సౌకర్యం ఉంది.
  • గుత్తి స్టేషన్ నుంచి బస్సు లేదా ఆటో ద్వారా తొండపాడు చేరుకోవచ్చు.

విమాన మార్గం ద్వారా:

  • సమీప విమానాశ్రయం: బెంగళూరు (కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం) – సుమారు 250 కిలోమీటర్లు
  • అక్కడి నుంచి రోడ్డు లేదా రైలు మార్గంలో గుత్తి చేరుకుని, అనంతరం తొండపాడు వెళ్లవచ్చు.

No comments