జగద్గిరిగుట్ట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 2026 | తిరుకల్యాణం, పల్లకి సేవ, పూజలు


 జగద్గిరిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడనుంది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వైదిక పూజలు, ఉత్సవ సేవలు సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు.

2026 ఉత్సవాల కార్యక్రమ వివరాలు

గురువారం (22వ తేదీ)

  • సాయంత్రం విశ్వక్సేనారాధన
  • స్వస్తి పుణ్యాహవాచనం
  • రక్షాబంధనం
  • వేదపారాయణం
  • ఆరగింపు, హారతి
  • మంత్రపుష్పం
  • తీర్థప్రసాద వినియోగం
  • రాత్రి 10:00 గంటలకు ద్వారబంధనం

శుక్రవారం (23వ తేదీ)

మధ్యాహ్నం స్వామివారి తిరుకల్యాణం వైభవంగా నిర్వహణ అనంతరం అన్నసమారాధనశ్రీ వాసవ కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో రాత్రి 10:00 గంటలకు ద్వారబంధనం

శనివారం (24వ తేదీ)

  • ధ్వజపట కంకణోద్వాసన
  • పండిత సన్మానం
  • స్వామివారి పల్లకి సేవ
  • ఇతర పూజా కార్యక్రమాలు

No comments