Karimnagar Venkateswara Swamy Temple: కరీంనగర్ మార్కెట్ రోడ్ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 2026 | ఉత్సవాల షెడ్యూల్, విశేషాలు
కరీంనగర్ నగరంలోని మార్కెట్ రోడ్‌లో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం భక్తుల ఆరాధనకు కేంద్రంగా నిలుస్తోంది.
సుమారు 152 సంవత్సరాలకుపైగా శ్రీవారు శంఖ–చక్రాలు, నామాలు, మీసాలతో దుబ్బపై ఉన్న రాతిలో స్వయంభువుగా వెలసినట్లు భక్తుల విశ్వాసం. ప్రతి శనివారం, విశేష పర్వదినాల్లో ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
2026 బ్రహ్మోత్సవాల కార్యక్రమ వివరాలు
జనవరి 23వ తేదీ
- ఉదయం: అధ్యయనోత్సవం
- సాయంత్రం: పరమపదోత్సవం
జనవరి 24వ తేదీ
- ఉదయం 9:00 గంటలకు అంకురార్పణ
- పాతబజార్ గౌరీశంకరాలయం నుంచి పుట్టమన్ను తేవడం
- సాయంత్రం 5:30 గంటల నుంచి పుణ్యాహవాచనం
- శేష వాహన సేవ
జనవరి 25వ తేదీ
- ఉదయం 8:00 గంటల నుంచి అగ్నిప్రతిష్ఠ
- ధ్వజారోహణం
- సూర్యప్రభ వాహన సేవ
- సాయంత్రం 6:30 గంటలకు చంద్రప్రభ వాహన సేవ
జనవరి 26వ తేదీ
- ఉదయం 10:00 గంటలకు కల్పవృక్ష వాహన సేవ
- పద్మశాలి సంఘం తరపున సారె సమర్పణ
సాయంత్రం 6:00 గంటలకు ప్రకాశంగంజ్ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం వద్ద
అశ్వ వాహన సేవ- గజ వాహన సేవలతో ఎదుర్కోలు ఉత్సవం
జనవరి 27వ తేదీ
- మధ్యాహ్నం 12:15 గంటలకు
- శ్రీదేవీ–భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి
- లక్ష్మీనారాయణస్వామి కల్యాణ మహోత్సవాలు
- సాయంత్రం 6:00 గంటలకు గరుడ వాహన సేవ
జనవరి 28వ తేదీ
- ఉదయం 5:00 గంటలకు తిరుపతి పండితులచే సుప్రభాత సేవ
- అన్నకూటోత్సవం
- ఉదయం 9:00 గంటలకు సింహ వాహన సేవ
- సాయంత్రం 6:00 గంటలకు సహస్రదీపాలంకరణ సేవ
- రాత్రి 8:00 గంటలకు హనుమత్ వాహన సేవ
జనవరి 29వ తేదీ
- ఉదయం 8:00 గంటల నుంచి
- మహాపూర్ణాహుతి
- వసంతోత్సవం
- చక్రస్నానం
- సాయంత్రం 5:00 గంటల నుంచి
- శ్రీ పుష్పయాగం
- ద్వాదశారాధన
- సప్తావరణాలు
- ధ్వజావరోహణ
- మహదాశీర్వచనం
- ఏకాంత సేవ
శోభాయాత్ర వివరాలు
- ఫిబ్రవరి 1న
- సాయంత్రం 6:00 గంటలకు
- మార్క్‌ఫెడ్ గ్రౌండ్ నుంచి శ్రీవారి శోభాయాత్ర నిర్వహణ
Post a Comment