సింహాచలం ఉప ఆలయాలు మాఘమాస ప్రత్యేక పూజలు 2026 – తేదీలు, ముఖ్య ఘట్టాలు

సింహాచలం దేవస్థానానికి చెందిన ఉప ఆలయాలైన మాధవస్వామి ఆలయం మరియు వేణుగోపాల స్వామి ఆలయాల్లో మాఘమాస ప్రత్యేక పూజలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమాలు జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతి రోజు స్వామి వారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరగనున్నాయి.

మాఘమాసంలో ముఖ్య ఉత్సవాలు & విశేష పూజలు

మాఘమాసంలో వచ్చే ముఖ్య పర్వదినాలు, ఆదివారాలను పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లకు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు.

తేదీ వారీ కార్యక్రమాల వివరాలు

  • జనవరి 25 – మొదటి ఆదివారం, రథసప్తమి సందర్భంగా స్వామి–అమ్మవార్ల కల్యాణ మహోత్సవం
  • జనవరి 29 – భీష్మ ఏకాదశి సందర్భంగా కల్యాణ మహోత్సవం
  • ఫిబ్రవరి 1 – రెండో ఆదివారం, మాఘ పౌర్ణమి, నాగవల్లి పూజలు
  • ఫిబ్రవరి 8 – మూడో ఆదివారం, పరస మహోత్సవం
  • ఫిబ్రవరి 15 – నాలుగో ఆదివారం, మహా శివరాత్రి సందర్భంగా స్వాములకు ప్రత్యేక పూజలు

అన్నదాన కార్యక్రమాలు

మాఘమాసంలో వచ్చే నాలుగు ఆదివారాల రోజున ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.

No comments