అశ్వర్థనారాయణస్వామి – శ్రీచక్రభీమలింగేశ్వరస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు 2026 – తేదీలు, ప్రత్యేకతలు
అనంతపురం జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అశ్వర్థ ఆలయంలో అశ్వర్థనారాయణ స్వామి, శ్రీచక్రభీమలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సమయం సమీపిస్తోంది. ఈ నెల జనవరి 25 నుంచి మాఘమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభం కానున్నాయి.
ఈ నెల జనవరి 25, అలాగే ఫిబ్రవరి 1, 8, 15 తేదీల్లో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.
శివ–కేశవుల దివ్యక్షేత్రం
దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించే పెన్నానది ఒడ్డున అశ్వర్థనారాయణ స్వామి మరియు శ్రీచక్రభీమలింగేశ్వర స్వామి ఎదురెదురుగా వెలసి పూజలందుకోవడం ఈ క్షేత్రం ప్రత్యేకత.
- అశ్వర్థనారాయణ స్వామిని శింగరబట్టు మహాముని ప్రతిష్ఠించారని
- శ్రీచక్రభీమలింగేశ్వర స్వామిని భీముడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది.
మాఘమాసంలో పెన్నానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
మాఘమాస ప్రత్యేక ఆచారాలు
- వేలాదిగా తరలివచ్చే భక్తులు పెన్నానదిలో పాలపొంగులు నిర్వహిస్తారు.
- స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లిస్తారు.
- మాఘమాస బ్రహ్మోత్సవాలు ఈ క్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించబడుతాయి.
Post a Comment