మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలంలోని గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి మరియు అమ్మవారికి నిత్య వైదిక కార్యక్రమాలు, వాహన సేవలు, ఊరేగింపులు ఘనంగా నిర్వహించనున్నారు.
2026 తేదీ వారీ కార్యక్రమాల వివరాలు
జనవరి 19వ తేదీ – స్వామివారికి పుణ్యాహవాచనం, అమ్మవారికి అష్టోత్తర శత (108) కలశాభిషేకం, నూతన వస్త్రాలు, ఆభరణాలతో అలంకరణ
20వ తేదీ – అంకురార్పణం, పల్లకీ సేవ
21వ తేదీ – ధ్వజపతాక ఊరేగింపు, భేరి పూజ, హనుమత్ వాహన సేవ
22వ తేదీ – శ్రీ స్వామివారి తిరు కల్యాణోత్సవం
23వ తేదీ – శేష వాహన సేవ, హంస వాహన సేవ
24వ తేదీ – పుష్పరథం (చిన్న తేరు)
25వ తేదీ – రథోత్సవం (పెద్ద తేరు)
26వ తేదీ – శకటోత్సవం
జనవరి 27వ తేదీ – చక్రతీర్థం