Venkateswara Swamy Temple: హెచ్బీకాలనీ మంగాపుర వేంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు 2026 – తేదీలు, ముఖ్య ఘట్టాలు
హైదరాబాద్ లోని హెచ్బీకాలనీ డివిజన్ పరిధిలోని మంగాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు స్వామివారికి విశేష సేవలు, హోమాలు, వాహన సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
2026 బ్రహ్మోత్సవాల తేదీ వారీ కార్యక్రమాలు
- జనవరి 19 – మంగళ వాయిద్యం, సుప్రభాత సేవతో బ్రహ్మోత్సవాల ప్రారంభం
- జనవరి 20 – గరుడ హోమం, శేషవాహన సేవ
- జనవరి 21 – శ్రీ వారికీ విశేష లక్ష పుష్పార్చన, హంసవాహన సేవ
- జనవరి 22 – సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ
- 23వ తేదీ – శ్రీ సూక్త హోమం, హనుమద్వాహన సేవ
- 24వ తేదీ – గజవాహన సేవ, శ్రీ వారికీ తిరు కల్యాణం
- 25వ తేదీ – అశ్వవాహన సేవ, గరుడ సేవ
- 26వ తేదీ – సుదర్శన హవనం, సర్వభూపాల వాహన సేవ
- 27వ తేదీ – ఆచార్య సన్మానం, తీర్థ ప్రసాద గోష్టితో బ్రహ్మోత్సవాల ముగింపు
Post a Comment