Chittaramma Jatara 2026: గాజులరామారం చిత్తారమ్మదేవి జాతర 2026 – తేదీలు, ముఖ్య ఘట్టాలు
భక్తుల మనసులలో నిలిచిన ఇలవేల్పు గాజులరామారం గ్రామ చిత్తారమ్మదేవి జాతరను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి జాతర తర్వాత రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా ఈ వేడుకకు విశేష గుర్తింపు ఉంది.
జాతర తేదీలు
- ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు
- మొత్తం ఎనిమిది రోజుల పాటు జాతర నిర్వహణ
ఆలయ చరిత్ర
ఇక్కడి పెద్దల కథనం ప్రకారం సుమారు 45 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం చెట్లు, పొదలు, గుట్టలతో నిండి ఉండేది. సాయంత్రం వేళ ఈ ప్రాంతంలో జన సంచారం ఉండేది కాదు.
అప్పట్లో కొంతమంది యువకులు ఆటలాడుతూ ఈ ప్రాంతంలో తిరుగుతుండగా చిన్న అమ్మవారి ప్రతిమ కనిపించింది. వారు ఆ ప్రతిమకు పూజలు చేసి అక్కడే నెలకొల్పారు.
ఆ యువకులే చిన్న కమిటీగా ఏర్పడి ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.
ఆ కమిటీ నాటి నుంచి నేటివరకు కొనసాగుతుండడం విశేషం.
కాలక్రమేణా ఆలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ, భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు.
జాతర ముఖ్య కార్యక్రమాలు
23వ తేదీ
- గణపతి హోమం
- అగ్నిప్రతిష్ట
24వ తేదీ
- చండీ హోమం
- పూర్ణాహుతి
సాయంత్రం గాజులరామారం నుంచి అమ్మవారి ఆలయం వరకు
- ఊల ఘటం
- ఘన ఊరేగింపు
25వ తేదీ (ఆదివారం) – ప్రధాన జాతర
- అమ్మవారికి అభిషేకాలు
- ఒడి బియ్యం, బోనాలు
- పోతరాజుల నృత్యాలతో వైభవోపేత ఊరేగింపు
26వ తేదీ
- రంగం
- దివ్యవాణి కార్యక్రమం
27, 28, 29వ తేదీలు
- కుంకుమార్చనలు
భక్తులు సమర్పించిన ఒడి బియ్యంతో
అన్న సంతర్పణ
30వ తేదీ
- జాతర ముగింపు కార్యక్రమాలు

Post a Comment