Simhachalam Tirukalyanam 2026 schedule: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవాలు 2026 – పూర్తి షెడ్యూల్
విశాఖపట్నం సమీపంలోని ప్రసిద్ధ క్షేత్రం సింహాచలం దేవస్థానం లో కొలువై ఉన్న శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు ఈ నెల 28వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
2026 ఉత్సవాల ప్రారంభం
- 28వ తేదీ రాత్రి – అంకురార్పణతో మహోత్సవాలకు శ్రీకారం
-
29వ తేదీ
- మధ్యాహ్నం 3 గంటలకు – కొట్నాల ఉత్సవం
- సాయంత్రం 4 గంటలకు – ఆరాధన
- 5 గంటలకు – గ్రామ బలిహరణ
- 5:30 గంటలకు – ధ్వజారోహణం
- 6:30 గంటలకు – ఎదురు సన్నాహ ఉత్సవం
- రాత్రి 8:30 గంటలకు – సింహగిరి మాడవీధుల్లో రథోత్సవం
- రాత్రి 10:30 గంటలకు – స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం
తదుపరి కార్యక్రమాలు
- 30వ తేదీ – సాయంత్రం 5 గంటలకు శేషవాహనంపై తిరువీధి
-
31వ తేదీ
- మధ్యాహ్నం 3:30 గంటలకు – పండిత సభ
- సాయంత్రం 6 గంటలకు – సర్వజన మనోరంజని వాహనం
- ఏప్రిల్ 1 – సాయంత్రం సూర్యప్రభ వాహనంపై తిరువీధి
-
ఏప్రిల్ 2
- ఉదయం – గంగధార వద్ద చక్రస్నానం
- రాత్రి – దొంగల దోపిడీ ఉత్సవం
-
ఏప్రిల్ 3
- ఉదయం – వినోదోత్సవం
- రాత్రి – శ్రీ పుష్పయాగంతో ఉత్సవాల ముగింపు
సాంస్కృతిక కార్యక్రమాలు
కల్యాణోత్సవాల సందర్భంగా మార్చి 30 నుండి ఏప్రిల్ 4 వరకు కొండపైన మరియు దిగువన భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
భక్తులకు ముఖ్య సమాచారం:
- మార్చి 28 నుండి ఏప్రిల్ 4 వరకు – సుప్రభాత సేవ, ఉదయం & రాత్రి ఆరాధన సేవలు రద్దు
- మార్చి 28 నుండి ఏప్రిల్ 13 వరకు – అన్ని ఆర్జిత సేవలు రద్దు

Comments
Post a Comment