Dharmapuri Narasimha Swamy: ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు 2026 – ఉత్సవ షెడ్యూల్, ఆలయ విశేషాలు
ధర్మపురి క్షేత్రంలోని ప్రధాన ఆలయాలు
ఈ క్షేత్రం అనేక దేవాలయాలతో ఆధ్యాత్మిక కేంద్రముగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా:
- లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం, ధర్మపురి (యోగ, ఉగ్ర స్వరూపాలు)
- వేంకటేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి
- రామలింగేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి
- ప్రసన్న ఆంజనేయస్వామి, వేణుగోపాల స్వామి, యమధర్మరాజు, సంతోషిమాత, రామ, దత్తాత్రేయ స్వామి, గడ్డ ఆంజనేయస్వామి, శివ సాయిబాలాజీ, అయ్యప్ప స్వామి, భక్త మార్కండేయ, గోదావరి మాత, వాసవీ కన్యకా పరమేశ్వరి, సత్యవతి (ఇసుక స్తంభం), మహాలక్ష్మి ఆలయాలు.
క్షేత్ర సమీపంలో అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి, తిమ్మాపూర్ సీతారామాంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి.
ధర్మపురి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలు ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పంచుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ స్వామివారి సేవలను దర్శిస్తున్నారు.
ఫిబ్రవరి 28 శుక్రవారం – ఏకాదశి
ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి. ఈ రోజు నిర్వహించే ముఖ్య కార్యక్రమాలు:
- యజ్ఞాచార్యుల ఆహ్వానం
- కలశ స్థాపన
- విశ్వక్సేన, వాసుదేవ ఆరాధనలు
- పుణ్యాహవచనం
- బ్రహ్మకలశ స్థాపన
- అంకురార్పణ
- వరాహతీర్థ కార్యక్రమం
- పుట్ట బంగారం తేవడం
మార్చి 1
రాత్రి 7 గంటలకు లక్ష్మీ నృసింహస్వామి ఊరేగింపు సేవ భక్తి నినాదాల మధ్య వైభవంగా నిర్వహిస్తారు.
మార్చి 2
రాత్రి 7 గంటలకు వేంకటేశ్వర స్వామి ఊరేగింపు సేవ జరుగుతుంది.
మార్చి 3 – చంద్రగ్రహణం సందర్భం
ఉదయం 6 నుండి 7 గంటల వరకు డోలోత్సవం నిర్వహిస్తారు.
అనంతరం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు.
మార్చి 4
మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మ పుష్కరిణి (కోనేరు)లో ఉగ్ర (కొత్త) లక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం, డోలోత్సవం నిర్వహిస్తారు.
మార్చి 5
మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మ పుష్కరిణిలో వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవం, డోలోత్సవం
సాయంత్రం 4 గంటలకు లక్ష్మీ నృసింహస్వామి దక్షిణ దిగ్యాత్ర
మార్చి 6
సాయంత్రం 4 గంటలకు లక్ష్మీ నృసింహ స్వామి ఉత్తర దిగ్యాత్ర
రాత్రి 8 గంటలకు భోగ మండప ఉత్సవం
రాత్రి 9 గంటలకు వేద సదస్సు
మార్చి 7
సాయంత్రం 4 గంటలకు వేంకటేశ్వర స్వామి దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలు
రాత్రి 8 గంటలకు దోపోత్సవం (దోపుకథ)
మార్చి 8
మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి
పగలు 3 గంటలకు స్వామివారి రథోత్సవం
రాత్రి 7 గంటలకు చక్రతీర్ధం
రాత్రి 9 గంటలకు యోగ లక్ష్మీ నృసింహస్వామి పుష్పయాగం
మార్చి 9
రాత్రి 7 గంటలకు వేంకటేశ్వర స్వామి పుష్పయాగం
రాత్రి 9 గంటలకు యోగ (పాత) లక్ష్మీ నృసింహ స్వామి ఏకాంతోత్సవం
మార్చి 10
రాత్రి 7 గంటలకు కొత్త (ఉగ్ర) నరసింహ స్వామి పుష్పయాగం
రాత్రి 9 గంటలకు వేంకటేశ్వర స్వామి ఏకాంతోత్సవం
మార్చి 11 – ముగింపు రోజు
రాత్రి 9 గంటలకు కొత్త (ఉగ్ర) లక్ష్మీ నరసింహ స్వామి ఏకాంతోత్సవంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగుస్తాయి.

Post a Comment