Venadu Perumal Temple: వేనాడు దీవి శ్రీ శృంగీశ్వర శ్రీరంగ పెరుమాల్ ఆలయం – వెయ్యేళ్ల పురాతన క్షేత్రం, సూర్య పూజ్యోత్సవ ప్రత్యేకత
తడ మండలం పులికాట్ సరస్సు మధ్యలోని వేనాడు దీవిలో వెలసిన శ్రీ శృంగీశ్వర శ్రీరంగ పెరుమాల్ ఆలయం అత్యంత పురాతనమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఈ ఆలయం సుమారు వెయ్యేళ్ల నాటి చారిత్రక ఆలయంగా భావిస్తున్నారు. ఈ ఆలయంలో ఒకే ప్రాంగణంలో ఓ పక్క ఆండాళ్ సమేత శ్రీరంగ పెరుమాల్, మరో పక్క మహాశివుని శివలింగం ప్రతిష్టితమై ఉండడం ప్రత్యేక విశేషం.
స్థల పురాణం
శ్రీ శృంగీశ్వర మహాముని శివ–కేశవుల విగ్రహాలను దక్షిణ భారతదేశానికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో వేనాడు దీవిలో ఒక రాత్రి విశ్రాంతి తీసుకున్నారని కథనం. ఆ సమయంలో మహామునికి కలలో శివకేశవులు దర్శనమిచ్చి, తమను అక్కడే ప్రతిష్టించాలని ఆదేశించినట్టు ఐతిహ్యం. దాంతో ఆ మహాముని శివుడు, శ్రీరంగ పెరుమాల్‌ను ఒకే ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేపట్టారని స్థల పురాణం చెబుతోంది.
ఆలయ విశేషాలు
ఈ ఆలయంలో ఏటా రెండు సార్లు సూర్య పూజోత్సవాలు జరగడం ప్రత్యేక ఆకర్షణ.
- మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వరుసగా మూడు రోజుల పాటు ఉదయం వేళల్లో సూర్యకిరణాలు శివలింగాన్ని నేరుగా స్పర్శిస్తాయి.
- అలాగే చైత్ర మాసంలో (ఏప్రిల్ నెలలో) పౌర్ణమి రోజుకు ముందు, తరువాత మూడు రోజుల పాటు సాయంత్రం సమయాల్లో శ్రీరంగ పెరుమాల్ మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకుతాయి.
అదేవిధంగా ధనుర్మాసం సందర్భంగా నెలంతా ప్రత్యేక పూజలు, ఆరాధనలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
Post a Comment