Narasimha Dwadasi: నృసింహ ద్వాదశి వ్రతం – మహత్యం, నియమాలు, 2026 తేదీ

ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతా వ్రత సమాహారంగా పేర్కొంటారు. శిశిర ఋతువుకు ముగింపు పలికే ఈ పవిత్ర మాసంలో ప్రతి తిథికీ ఒక విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఆ విశేషాన్ని అనుసరించి భక్తులు వ్రతాలు, పూజలు ఆచరిస్తారు.

ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి లేదా గోవింద ద్వాదశిగా జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో ఈ పవిత్ర తిథి ఫిబ్రవరి 28న వస్తుంది.

నృసింహ ద్వాదశి ప్రాముఖ్యత

  • ఈ రోజు నరసింహుడును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.
  • మహావిష్ణువు దశావతారాల్లో ఉగ్రకరుణామూర్తిగా వెలసిన నరసింహస్వామిని పూజిస్తే అపార ఐశ్వర్యాలు, శత్రునివారణ, భయ నివృత్తి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి.
  • ఈ రోజు గంగాస్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. గంగా నదిలో స్నానం చేసిన ఫలితం సమస్త పాపక్షయాన్ని కలిగిస్తుందని పురాణాలు వివరిస్తాయి.
  • వైష్ణవ ఆలయాలను దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభప్రదం.

ఈ రోజు చేయవలసిన పూజా విధానాలు

  • నరసింహస్వామి ఆలయ దర్శనం
  • ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం
  • విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం
  • మహిళలు సీతామాత పూజ, విష్ణు పూజ ఆచరించడం
  • నదీ స్నానం లేదా తులసి దళాలతో శ్రీహరికి అర్చన

కొన్ని ప్రాంతాల్లో ఈ ద్వాదశిని గోవింద ద్వాదశిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు భక్తితో ఉపవాసం ఉండి, శ్రీహరిని ధ్యానిస్తే సకల సంపదలు, ఐశ్వర్యాలు, సౌఖ్యాలు చేకూరుతాయని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

No comments