Goshpadakshetra Sundareswara Temple: గోష్పాదక్షేత్ర శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత సుందరేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలు 2026

పశ్చిమ గోదావరి జిల్లాలోని పవిత్ర గోష్పాదక్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత సుందరేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 13వ తేదీన స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు మానేపల్లి శ్రీనివాస శాస్త్రి తెలిపారు. ఫిబ్రవరి 13 నుంచి 17వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలు భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి.

2026 ఉత్సవాల కార్యక్రమ వివరాలు

ఫిబ్రవరి 13 – కల్యాణ మహోత్సవం

ఉదయం 9:45 గంటలకు

  • సుందరేశ్వరస్వామి కల్యాణ సంకల్పం
  • విఘ్నేశ్వర పూజ
  • పుణ్యాహవచనం
  • పంచగవ్య ప్రాశనం
  • త్రిశూల పూజ
  • అంకురార్పణ
  • వాస్తు పూజ
  • అగ్నిముఖం
  • ధ్వజారోహణం

సాయంత్రం 7 గంటలకు
శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత సుందరేశ్వరస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది.

ఫిబ్రవరి 15 – మహాశివరాత్రి ప్రధానోత్సవం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజాము నుంచే ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

  • సామూహిక రుద్రాభిషేకాలు
  • పంచామృత స్నానాలు

రాత్రి కార్యక్రమాలు:

  • రాత్రి 9 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం
  • రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల దర్శనం

ఫిబ్రవరి 16

  • నిత్యౌపోసన
  • బలిహారణం

ఫిబ్రవరి 17 – ముగింపు ఉత్సవాలు

  • పూర్ణాహుతి
  • వసంతోత్సవం
  • త్రిశూల స్నానం

సాయంత్రం కార్యక్రమాలు:

  • సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ
  • రాత్రి 8 గంటలకు శ్రీ పుష్పయాగ మహోత్సవం

మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగుస్తాయి

No comments