Ahobilam Brahmotsavam 2026: అహోబిలం బ్రహ్మోత్సవాలు 2026 – నవనరసింహ క్షేత్ర వైభవం, వాహన సేవల షెడ్యూల్



అంధ్రప్రదేశ్‌లోని నల్లమల అరణ్య గిరిశ్రేణుల మధ్య విరాజిల్లుతున్న మహా పుణ్యక్షేత్రమైన అహోబిలం లో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం భక్తి, శ్రద్ధ, వైష్ణవ సంప్రదాయాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవైష్ణవ పరంపరలో పరమ పవిత్రంగా భావించే 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన అహోబిల నవనారసింహ క్షేత్రం, ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి రమణీయతకు కూడ ఆలవాలంగా నిలుస్తోంది. ఈ క్షేత్ర మహిమను బ్రహ్మాండ పురాణంలో విపులంగా వర్ణించారు.

క్షేత్ర మహిమ – అవతార రహస్యం

ఇది రాక్షసరాజైన హిరణ్యకశిపుని రాజ్యంగా పురాణాలు పేర్కొంటాయి. తన పరమభక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు మహావిష్ణువు స్తంభం నుండే నరసింహ స్వరూపంలో ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించిన ప్రదేశమే అహోబిలం.

నరసింహస్వామి ఉగ్రరూపాన్ని, అద్భుత బలాన్ని చూసి దేవతలు “అహో బలం! అహో బలం!” అని స్తుతించగా ఈ ప్రాంతం “అహోబలం”గా ప్రసిద్ధి చెందింది. అలాగే ఎగువ అహోబిలంలోని గుహ (బిలం)లో స్వామి స్వయంభువుగా వెలసినందున “అహో-బిలం” అనే నామం ప్రాచుర్యం పొందింది.

నవనారసింహ క్షేత్ర వైభవం

ఈ క్షేత్రంలో స్వామివారు తొమ్మిది ప్రదేశాలలో తొమ్మిది రూపాలలో దర్శనమిస్తారు. అందుచేత ఇది “నవనారసింహ క్షేత్రం”గా ప్రసిద్ధి.

నవనారసింహ స్వరూపాలు:

  • జ్వాలా నరసింహ
  • అహోబల నరసింహ
  • మాలోల నరసింహ
  • క్రోడ (వరాహ) నరసింహ
  • కారంజ నరసింహ
  • భార్గవ నరసింహ
  • ఛత్రవట నరసింహ
  • పావన నరసింహ
  • (ప్రహ్లాద వరద / లక్ష్మీనరసింహ స్వరూప దర్శనం ప్రధానంగా పూజింపబడుతుంది)

బ్రహ్మోత్సవాల వైభవం

ఫాల్గుణ శుద్ధ పంచమి నుండి పౌర్ణమి వరకు అహోబిలంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతాయి. 2026 సంవత్సరంలో ఈ మహోత్సవాలు ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా:

  • ప్రతిరోజూ వాహనసేవలు
  • స్వామివారి ఊరేగింపులు
  • తిరుకల్యాణోత్సవం
  • రథోత్సవం
  • పుష్పయాగం
  • గరుడోత్సవం

భక్తులను పరమానందంలో ముంచెత్తుతాయి.

2026 వాహన సేవల వివరాలు

ఎగువ అహోబిలం (Upper Ahobilam)

ఫిబ్రవరి 20 (శుక్ర) – సెల్వర్ కుతు ఉత్సవం (సా. 6 గం.)
ఫిబ్రవరి 21 (శని) – అంకురార్పణ (సా. 6 గం.)
ఫిబ్రవరి 22 (ఆది) – ద్వజారోహణం (ఉ. 8 గం.), భేరి పూజ (సా. 4 గం.), సింహ వాహన సేవ (సా. 7 గం.)
ఫిబ్రవరి 23 (సోమ) – హంస వాహన సేవ (ఉ. 7 గం.), సూర్యప్రభ వాహన సేవ (సా. 7 గం.)
ఫిబ్రవరి 24 (మంగళ) – హనుమంత వాహన సేవ (సా. 7 గం.)
ఫిబ్రవరి 25 (బుధ) – శేష వాహన సేవ (ఉ. 7 గం.), చంద్రప్రభ వాహన సేవ (సా. 7 గం.)
ఫిబ్రవరి 26 (గురు) – శరభ వాహన సేవ (సా. 7 గం.)
ఫిబ్రవరి 27 (శుక్ర) – పొన్న చెట్టు వాహన సేవ (సా. 7 గం.)
ఫిబ్రవరి 28 (శని) – గజ వాహన సేవ (సా. 4 గం.), తిరుకల్యాణోత్సవం (సా. 7 గం.)
మార్చి 01 (ఆది) – తొట్టి తిరుమంజనం (సా. 4 గం.), అశ్వ వాహన సేవ (సా. 7 గం.)
మార్చి 02 (సోమ) – రథోత్సవం (ఉ. 9:15 గం.)
మార్చి 03 (మంగళ) – ద్వాదశారాధనం, పుష్పయాగం (సా. 4 గం.), గరుడోత్సవం, ద్వజావరోహణం (రా. 10 గం.)

దిగువ అహోబిలం (Lower Ahobilam)

ఫిబ్రవరి 21 (శని) – సెల్వర్ కుతు ఉత్సవం (సా. 6 గం.)
ఫిబ్రవరి 22 (ఆది) – అంకురార్పణ (సా. 6 గం.)
ఫిబ్రవరి 23 (సోమ) – ద్వజారోహణం (ఉ. 5:50 గం.), భేరి పూజ (సా. 4 గం.), సింహ వాహన సేవ (సా. 7 గం.)
ఫిబ్రవరి 24 (మంగళ) – హంస వాహన సేవ (ఉ. 7 గం.), సూర్యప్రభ వాహన సేవ (సా. 7 గం.)
ఫిబ్రవరి 25 (బుధ) – గరుడ విమానం (ఉ. 7 గం.), హనుమంత వాహన సేవ (సా. 7 గం.)
ఫిబ్రవరి 26 (గురు) – శేష వాహన సేవ (ఉ. 7 గం.), చంద్రప్రభ వాహన సేవ (సా. 7 గం.)
ఫిబ్రవరి 27 (శుక్ర) – మోహినీ అలంకరణ (ఉ. 5 గం.), శరభ వాహన సేవ (సా. 7 గం.)
ఫిబ్రవరి 28 (శని) – శ్రీ వేణుగోపాల అలంకరణ (ఉ. 7 గం.), పొన్న చెట్టు వాహన సేవ (సా. 7 గం.)
మార్చి 01 (ఆది) – గజ వాహన సేవ (సా. 4 గం.), తిరుకల్యాణోత్సవం (సా. 7 గం.)
మార్చి 02 (సోమ) – తొట్టి తిరుమంజనం (సా. 4 గం.), అశ్వ వాహన సేవ (సా. 7 గం.)
మార్చి 03 (మంగళ) – రథోత్సవం (ఉ. 8 గం.)
మార్చి 04 (బుధ) – చక్రస్నానం (ఉ. 7 గం.), ద్వాదశారాధనం, పుష్పయాగం (సా. 4 గం.), గరుడోత్సవం, ద్వజావరోహణం (రా. 10 గం.)

మార్చి 05–07 – తెప్పోత్సవాలు

No comments