Urukondapeta Anjaneya Swamy Temple: ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు 2026
అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల కార్యక్రమాల వివరాలు:
జనవరి 17:
ఉదయం ఊర్కొండపేటలోని దివంగత చిరివెళ్లి కృష్ణమూర్తి శర్మ అర్చకుల వారి గృహం నుంచి ఉత్సవమూర్తిని పల్లకిలో మంగళవాయిద్యాల మధ్య ఆలయానికి తీసుకువస్తారు.
ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, మూలస్వామికి పంచామృతాభిషేకం, నూతన వస్త్రధారణ, వెండి ఆభరణాలతో అలంకరణ చేసి సహస్రనామార్చన నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 11 గంటలకు శకటోత్సవం (బండ్లు) జరుగుతాయి.
జనవరి 18:
ఉదయం పంచసూక్తాలతో పూజ, సహస్రనామార్చన.
గణపతి, నవగ్రహ, అష్టదిక్పాలక, లక్ష్మీ అవనంతో హోమం నిర్వహిస్తారు.
రాత్రి స్వామివారికి గజవాహన సేవ, భజనలు, ప్రదోష పూజలు జరుగుతాయి.
జనవరి 19:
ఉదయం గణపతి, నవగ్రహ, అష్టదిక్పాలక, సరస్వతి అవనంతో హోమం.
రాత్రి తెల్లవారితే (మంగళవారం) ప్రత్యేక పూజలు, రథోత్సవం నిర్వహిస్తారు.
జనవరి 20:
రాత్రి స్వామివారికి పల్లకీసేవ, హరికథ కాలక్షేపం జరుగుతుంది.
జనవరి 21:
ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం, అష్టోత్తర పూజలు.
రాత్రి ఒంటె వాహన సేవ, అనంతరం నెమలి వాహన సేవ, గ్రామ భజనలు నిర్వహిస్తారు.
జనవరి 22:
మండలితో భజనలు జరుగుతాయి.
జనవరి 23:
స్వామివారికి అభిషేకాలు, పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది.
జనవరి 24 (ముగింపు):
ఉదయం చక్రతీర్థ స్నానం, మధ్యాహ్నం గోపూజ నిర్వహిస్తారు.
సాయంత్రం 6 గంటలకు ఉత్సవ విగ్రహాన్ని దేవాలయం నుంచి ఊర్కొండపేటలోని చిరివెళ్లి కృష్ణమూర్తి అర్చకుల వారి గృహానికి మంగళహారతులు, వాయిద్యాల మధ్య తీసుకువెళ్లడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Post a Comment