టిటిడి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో
జనవరి 25న రథసప్తమి పర్వదినం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.
రథసప్తమి ఉత్సవాలలో భాగంగా తెల్లవారు జామున 3.00 నుంచి 5.00 గంటల వరకు
శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు.
వాహన సేవల వివరాలు:
- ఉదయం 5.30 – 7.30 గంటలు : సూర్యప్రభ వాహనం
- ఉదయం 8.00 – 9.00 గంటలు : హంస వాహనం
- ఉదయం 9.30 – 10.30 గంటలు : హనుమంత వాహనం
- ఉదయం 11.30 – మధ్యాహ్నం 1.00 గంట : పెద్దశేష వాహనం
- మధ్యాహ్నం 1.30 – 3.00 గంటలు : ముత్యపు పందిరి వాహనం
- మధ్యాహ్నం 3.30 – సాయంత్రం 5.00 గంటలు : సర్వభూపాల వాహనం(శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు ఊరేగుతారు)
- రాత్రి 8.00 – 9.30 గంటలు : గరుడ వాహనం
భక్తులు రథసప్తమి వేడుకలను అర్ధ బ్రహ్మోత్సవం లేదా ఒక రోజు బ్రహ్మోత్సవంగా భావిస్తారు.
