టిటిడి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో
జనవరి 18 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.
మాఘ మాసంలో ఆలయంలో దివ్యప్రబంధ పారాయణం చేయడం ప్రాచీన ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు
ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, సేనాధిపతి, ఆళ్వార్లు వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధ పారాయణం జరుగుతుంది.
ముఖ్య కార్యక్రమాలు:
- జనవరి 28 – చిన్న శాత్తుమొర
- ఫిబ్రవరి 03 – ప్రణయకలహ మహోత్సవం
- ఫిబ్రవరి 07 – పెద్ద శాత్తుమొర
ఫిబ్రవరి 10న నిర్వహించే తన్నీర్ అముధు ఉత్సవంతో అధ్యయనోత్సవాలు ముగియనున్నాయి.
