Srinivasa Mangapuram Brahmotsavam: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 – వాహనసేవల వివరాలు
శ్రీనివాసమంగాపురంలోని ప్రసిద్ధ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవుతాయి.
ప్రతిరోజూ
- ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు
- రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు.
2026 బ్రహ్మోత్సవాల వాహన సేవల వివరాలు
ఫిబ్రవరి 8, 2026 (ఆదివారం)
- ఉదయం : ధ్వజారోహణం (కుంభ లగ్నం – ఉ. 8.15 నుంచి 8.35 గంటల వరకు)
- రాత్రి : పెద్దశేష వాహనం
ఫిబ్రవరి 9, 2026
- ఉదయం : చిన్నశేష వాహనం
- రాత్రి : హంస వాహనం
ఫిబ్రవరి 10, 2026
- ఉదయం : సింహ వాహనం
- రాత్రి : ముత్యపుపందిరి వాహనం
ఫిబ్రవరి 11, 2026
- ఉదయం : కల్పవృక్ష వాహనం
- రాత్రి : సర్వభూపాల వాహనం
ఫిబ్రవరి 12, 2026
- ఉదయం : పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారం)
- రాత్రి : గరుడ వాహనం
ఫిబ్రవరి 13, 2026
- ఉదయం : హనుమంత వాహనం
- మధ్యాహ్నం : వసంతోత్సవం (మ. 2 నుంచి 3 గంటల వరకు)
- సాయంత్రం : స్వర్ణరథం (సా. 4 నుంచి 5 గంటల వరకు)
- రాత్రి : గజ వాహనం
ఫిబ్రవరి 14, 2026
- ఉదయం : సూర్యప్రభ వాహనం
- రాత్రి : చంద్రప్రభ వాహనం
ఫిబ్రవరి 15, 2026
- ఉదయం : రథోత్సవం
- రాత్రి : అశ్వ వాహనం
ఫిబ్రవరి 16, 2026
- ఉదయం : చక్రస్నానం (ఉ. 9.55 నుంచి 10.15 గంటల వరకు)
- రాత్రి : ధ్వజావరోహణం (సా. 6 నుంచి రాత్రి 7 గంటల వరకు)

Post a Comment