Mauni Amavasya: మౌని అమావాస్య 2026 – తేదీ, ప్రాధాన్యం, పితృతర్పణాలు, గంగాస్నానం, మౌనవ్రతం
సూర్యుడు మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తాడు. ఆ తరువాత వచ్చే పుష్యమాస అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్యకు శాస్త్ర, పురాణ పరంగా అత్యంత ప్రాధాన్యం ఉంది.
మౌని అమావాస్య ప్రాముఖ్యత
ఈ రోజున పితృతర్పణాలు, నదీ స్నానాలు, మౌన వ్రతం (రోజంతా మాట్లాడకుండా ఉండటం) చేయడం ఎంతో పుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.
మౌని అమావాస్య నాడు గంగానది అమృతంగా మారుతుందని పురాణాలలో పేర్కొనబడింది.
గంగాస్నానం – త్రివేణీ సంగమ మహిమ
ఈ పవిత్ర రోజున వారణాసిలోని గంగానదిలో, అలహాబాద్ (ప్రయాగ్)లోని త్రివేణీ సంగమంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.
గంగాస్నానం చేయలేని వారు సమీపంలోని నదిలో లేదా ఇతర నీటి వనరుల్లో గంగా దేవిని తలచుకొని స్నానం చేసి, తమ సామర్థ్యానికి తగ్గట్టుగా దాన ధర్మాలు చేయడం ఉత్తమం అని పెద్దలు చెబుతారు.
పితృ తర్పణం ఫలితం
మౌని అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం సమర్పించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని పురాణ వచనం. పితృ దేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం.
మౌన వ్రతం – ఆత్మ నియంత్రణ
ఈ రోజున మాటల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
- వాగ్వాదాలు, తగాదాలకు దూరంగా ఉండాలి
- ఎవరికీ కీడు చేయకూడదు
- మాట, మనసు రెండింటిపై నిగ్రహం అవసరం
కాకి, శునకం, గోమాతను పూర్వీకులకు సంబంధించినవిగా భావిస్తారు. అందువల్ల వీటికి ఆహారం ఇవ్వడం మర్చిపోకూడదు.
దాన ధర్మాల ప్రాధాన్యం
మౌని అమావాస్య రోజున:
- ఎవ్వరినీ మోసం చేయకూడదు
- సాధన, తపస్సు చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది
- ఇంటికి వచ్చిన బిక్షువులను ఖాళీ చేతులతో పంపకూడదు
- పేదలు, నిస్సహాయుల పట్ల అనుమానం చూపకూడదు
ఈ రోజున తప్పుడు పనులు చేస్తే అనేక పాపాలు చుట్టుకుంటాయని శాస్త్ర హెచ్చరిక.
నిషేధాలు
మౌని అమావాస్య నాడు చంద్ర దర్శనం ఉండదు. అందువల్ల ప్రతికూల శక్తులు బలపడే అవకాశం ఉందని నమ్మకం.
కాబట్టి:
- నిర్జన ప్రదేశాలకు
- స్మశానవాటికలకు
- అమావాస్య రోజున మర్రిచెట్టు దగ్గరకువెళ్లకూడదని శాస్త్రోక్తి.
ఉపవాసం, నియమాలు
రోజంతా మౌనంగా ఉండలేని వారు కనీసం స్నానం, దానం, ధర్మాలు చేసే ముందు మౌనం పాటించాలి. ఉపవాసం చేయడం శ్రేయస్కరం.
ఇలా చేయడం వల్ల మనలోని ప్రతికూలతలు తొలగి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది.
2026: జనవరి 18.

Post a Comment